ముందుగా గవర్నర్ కు మన్ననూరులోని హరిత హోటల్ వద్ద జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్, జిల్లా ఎస్ పి కె. మనోహర్ లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ హరిత హోటల్ లో మొక్కలు నాటారు. అనంతరం మన్ననూరులోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ మృగ వని గెస్ట్ హౌస్ లో రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.
ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ లో చేపట్టిన కార్యక్రమాలపై రాష్ట్ర గవర్నర్ కు వివరించారు. ముఖ్యంగా రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నీటి నిర్వహణ, అగ్ని ప్రమాదాల నివారణ, నిర్వహణ, అడవుల పునరుద్ధరణ, అడవుల సంరక్షణ కార్యకలాపాలపై వివరించారు.
ఇక్కడే రిజర్వ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో గిరిజన చెంచు మహిళలకు ఏర్పాటు చేసిన చేతి వృత్తుల కార్యక్రమం లబ్ధిదారులతో రాష్ట్ర గవర్నర్ కలుసుకుని వారితో మాట్లాడారు. వారు తయారుచేసిన వస్తువులను పరిశీలించారు. అనంతరం ఆమె లింగాల మండలం అప్పాపూర్ గిరిజన చెంచు పెంటకు బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్, జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్,అదనపు కలెక్టర్ మను చౌదరి,సి ఎఫ్ శ్రీనివాస్,డి ఎఫ్ ఓ కిష్టగౌడ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ పర్యటనలో ఆ ప్రాంత శాసనసభ్యులెవ్వరు పాల్గొనలేదు. కొంత కాలంగా గవర్నర్ పర్యటనలలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎవ్వరు పాల్గొనడం లేదు.
శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న గవర్నర్
అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి అమ్మవారల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఆమెకు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించి సత్కరించారు.
More Stories
దేశంలోనే సుసంపన్న రాష్ట్రం తెలంగాణ
ఇన్కాయిస్కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?