ఉద్రిక్తతకు దారితీసిన ఏబీవీపీ చలో కలెక్టరేట్

విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ స్కాలర్ షిప్స్ ,ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను ప్రభుత్వం  విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా  చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చింది.
 దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు ధర్నాలు చేసి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగిన ఎబివిపి కార్యాకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
 అయితే ఇది పలుచోట్ల ఉద్రిక్తతకు దారి తీసింది.  ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ,ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  విద్యార్థులు ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
 సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాలని, మెస్ ఛార్జీలను రూ 1500 నుంచి రూ 3,000కు  పెంచాలని డిమాండ్ చేశారు.  విద్యార్థుల సంక్షేమం నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు.