52 మందితో యోగి మంత్రివర్గం ప్రమాణస్వీకారం

52 మందితో యోగి మంత్రివర్గం ప్రమాణస్వీకారం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. విజయవంతంగా ఐదేళ్ల పాలన పూర్తి చేసిన ఒక ముఖ్యమంత్రి వరుసగా రెండోసారి మళ్లీ ప్రభుత్వ పగ్గాలను చేపట్టడం గత 37 ఏళ్లలో ఇదే ప్రథమం. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని  నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, సాధుసంతులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. 
 
ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ చేత గవర్నర్ ఆనంది బెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా బ్రిజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య  ప్రమాణ స్వీకారం చేశారు. యోగి ఆదిత్యనాథ్ 52 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 
 
కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హర్యానా సీఎం ఎల్ఎల్ ఖట్టార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్, ఆసోం సీఎం హిమాంత బిస్వా శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ సీఎం భూ పేంద్ర పటేల్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.
 
యూపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంల సంప్రదాయాన్ని కొనసాగించాలని కొనసాగింపుగా ఈ సారి కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను తీసుకున్నారు. ఈ క్రమంలో కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్నికల్లో కేశవ్ ప్రసాద్ ఓటమి పాలైనప్పటికీ ఆయనకు మరోసారి అవకాశమిచ్చారు. ఇక గత ప్రభుత్వంలో డిప్యూటీగా ఉన్న దినేశ్ శర్మ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆ స్థానాన్ని బ్రిజేష్ పాఠక్తో భర్తీ చేశారు. 
 

మంత్రులు వీరే…

క్యాబినెట్: కేశవ్ ప్రసాద్ మౌర్య (ఉప ముఖ్యమంత్రి), బ్రజేష్ పాఠక్ (ఉప ముఖ్యమంత్రి), సూర్య ప్రతాప్ షాహి, సురేష్ కుమార్ ఖన్నా, స్వతంత్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, లక్ష్మీనారాయణ చౌదరి, జయవీర్ సింగ్, ధర్మపాల్ సింగ్, నంద్ గోపాల్ గుప్తా, భూపేంద్ర సింగ్ చౌదరి, అనిల్ రాజ్‌భర్, జితిన్ ప్రసాద, రాకేష్ సచన్, అరవింద్ కుమార్ శర్మ, యోగేంద్ర ఉపాధ్యాయ్, ఆశిష్ పటేల్, సంజయ్ నిషద్.

సహాయ మంత్రులు (ఇండిపెండెట్ చార్జి)

నితిన్ అగర్వాల్, కపిల్ దేవ్ అగర్వాల్, రాజేంద్ర జైశ్వాల్, సందీప్ సింగ్, గులాబ్ దేవి, గిరీష్ చంద్ర యాదవ్, థర్మవీర్ ప్రజాపతి, అసిం అరుణ్, జేపీఎస్ రాథోడ్, దయాశంకర్ సింగ్, నరేంద్ర కష్యప్, దినేష్ ప్రతాప్ సింగ్, అరుణ్ కుమార్ సక్సేనా, దయాశంకర్ మిశ్రా దయాళు.

సహాయ మంత్రులు

మయాంకేశ్వర్ సింగ్, దినేష్ ఖటీక్, సంజీవ్ గాండ్, బల్దేవ్ సింగ్ ఒలేఖ్, అజిత్ పాల్, జశ్వంత్ సైని, రాంకేష్ నిషద్, మనోహర్ లాల్ మన్ను కోరి, సంజయ్ గాంగ్వార్, బ్రిజేష్ సింగ్, కేపీ సింగ్, సురేష్ రహి, సోమేందర్ తోమర్, అనూప్  ప్రధాన్ వాల్మీకి, ప్రతిభా శుక్లా, రాకేష్ రాథోర్ గురు, రజనీ శర్మ, సతీష్ శర్మ, డానిష్ అజాద్ అన్సారీ, విజయ్ లక్ష్మీ గౌతమ్.