యూనిస్కో అద్భుతం అన్న ఓ అధికారి సంతకం

సంత‌కం అంటే చాలా మంది  కోడి కెలికిన‌ట్టు పెట్టేసి వ‌దిలేస్తారు. అయితే కర్ణాటకలోని ఓ ప్రభుత్వ అధికారి మాత్రం తన సంతకాన్ని మరెవ్వరు ఫోర్జరీ చేయరాదని ఎంతో జాగ్రత్తగా, ఓ కళాఖండం వలే పెడుతూ ఉంటారు. దానిని చూసి ఏకంగా యునెస్కో అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించింది.
ఒక్కొక్కరి సంతకం ఒక్కోలా ఉంటుంది. కర్నాటకలోని హోనావర్ ప్రాంతానికి చెందిన శాంతయ్య అనే అధికారి సంతకం మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. శాంతయ్య సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నారు. పూర్తి పేరు కొంపల్ సోమపుర శాంతయ్య.
సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నది. అందుకే, తన సంతకం విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. మరెవరూ ఫోర్జరీ చేసేందుకు వీలు లేకుండా, ఎంతో కష్టపడి, సంక్లిష్టమైన రీతిలో సంతకం చేయడం అలవర్చుకున్నారు. ఏకంగా ఐక్యరాజ్యసమితి సంస్థ యునెస్కో  ఇంతకంటే అద్భుతమైన సంతకం ప్రపంచంలో మరెక్కడా ఉండదు, ఎవరూ చేయలేరంటూ యునెస్కో సైతం శాంతయ్యకు కితాబునిచ్చింది.
గతంలో ఓ హైకోర్టు జడ్జి కూడా శాంతయ్య సంతకం చూసి ఆశ్చర్యపోయారట. ప్రత్యేకంగా శాంతయ్యను ఇంటికి పిలిపించుకుని అభినందించి పంపిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు శాంతయ్య సంతకంతో పాటు, మరికొన్ని విచిత్రమైన సంతకాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.