రూ 1 లక్ష కోట్లు దాటిన ఏపీ రెవెన్యూ లోటు

రెవెన్యూ లోటు అక్షరాలా లక్ష కోట్లు దాటడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అస్తవ్యస్త ఆర్ధిక నిర్వహణలో దేశంలో సరికొత్త రికార్డు సృష్టించినట్లు అయింది. దాదాపుగా మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో అప్పటికి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. 

అర్థికశాఖ అధికారుల సమచారం ప్రకారం ఫిబ్రవరి నెలాఖరు వరకు రు. 1,01,142 కోట్లకు లోటు చేరింది. రాష్ట్ర ఆర్ధిక రంగంలోనే ఇది ఒక రికార్డుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి నెల నురచి ఆదాయానికీ వ్యయానికి మధ్య అంతరం గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. 

ఏప్రిల్‌ నెలలో రూ. 5,037 కోట్లు ఆదాయం లభిరచగా, ఖర్చు ఏకంగా రూ 15,166 కోట్లుగా నమోదైంది. దీంతో  తొలి నెల్లోనే  రూ 10,129 కోట్ల లోటు తేలింది. అప్పటి నుంచి ప్రతి నెలా లోటు పెరుగుతూనే వస్తున్నది. 

 అత్యధికంగా ఫిబ్రవరిలో 13, 480 కోట్లు లోటుగా గుర్తించగా, ఏప్రిల్‌, జూన్‌, సెప్టెరబర్‌, డిసెంబర్‌ నెలల్లో పది వేల కోట్లుంది. ఫిబ్రవరి నెలలో రూ 5,116 కోట్ల రూపాయల ఆదాయం లభించగా, వ్యయం ఏకంగా  రూ 18,596 కోట్లకు చేరడం చర్చనీయాంశమైంది. 

అంతకు ముందు జూన్‌లో రూ 18,002 కోట్లు వ్యయంగా నమోదుకాగా, సెప్టెరబర్‌, డిసెంబర్‌ నెలల్లో కూడా  రూ 16 వేల కోట్లకు మించి ఖర్చు జరిగింది. ఇక చివరి మాస మైన మార్చిలో కూడా లోటు రూ 15 నురచి 18 వేల కోట్లలోనే ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం వచ్చే ఏడాది కూడా ఉంటుందంటున్నారు