ఏపీ సర్కార్ తనను రిలీవ్ చేసినా తెలంగాణ సర్కార్ విధుల్లోకి తీసుకోవడం లేదని అభిషేక్ మహంతి క్యాట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే కేసులో సీఎస్ సోమేష్ కుమార్ నిన్న క్యాట్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన విచారణకు హాజరుకాకపోవడంపై తీవ్ర అసంతృప్తి క్యాట్ వ్యక్తం చేసింది. వెంటనే వర్చువల్ విధానంలో హాజరు కావాలని చెప్పడంతో గంట సేపట్లో క్యాట్ విచారణకు హాజరయ్యారు.
పలు అంశాలను ఐపీఎస్ అభిషేకం మహంతికి క్యాట్ కు వివరించారు. ఐఏఎస్ శ్రీలక్ష్మీని క్యాట్ ఆదేశాలతో ఏపీకి ఐదు రోజుల్లో రిలీవ్ చేశారని వారి దృష్టికి తీసుకొచ్చారు. ఒక్కో అధికారి కేటాయింపు విషయంలో ప్రభుత్వ వైఖరి వివక్ష కనిపిస్తోందని క్యాట్ కు అభిషేక్ మొహంతి ఫిర్యాదు చేశారు. దీంతో మార్చి 11లోపు అభిషేక్ మొహంతికి పోస్టింగ్ ఇవ్వాలని, అదే రోజు విచారణకు హాజరుకావాలని హైదరాబాద్ బెంచ్ క్యాట్ ఆదేశించింది.

More Stories
తుమ్మిడిహెట్టి ఆనకట్టపై 1న కేంద్ర జల సంఘం భేటీ
ఎస్ఐఆర్ ప్రక్రియలో నకిలీ వివరాలు ఇస్తే జైలు శిక్ష
సృజనోత్సవ్లో స్విస్ ప్రభంజనం.. భాషా సాంస్కృతిక శాఖ సత్కారం