అఖిలేష్ యాదవ్‌పై ఎఫ్ఐఆర్

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే కారణంతో అఖిలేష్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్‌లోని ఈటావా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. 

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నిన్న(ఆదివారం) మూడవ దశ పోలింగ్ జరిగింది.అయితే సఫారీలోని ఓ పోలింగ్ బూత్‌లో భార్యతో కలిసి ఓటేసిన అఖిలేష్.. పోలింగ్ బూత్ బయటే విలేకరులతో మాట్లాడుతూ సీఎం  యోగి ఆదిత్యనాథ్ అధికారంలో ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శలు చేశారు. 

అయితే అఖిలేష్ తీరు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. అఖిలేష్ యాదవ్ మొట్టమటిసారి అసెంబ్లీ ఎన్నిల బరిలోకి దిగుతున్నారు.  సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అసెంబ్లీ పోరులోకి దిగడం ఇదే మొదటిసారి. వీరిరువురూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి పలుమార్లు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ తర్వాత శాసన మండలి నుంచి సభ్యత్వం పొందారు.