శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హత్య

కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ నగరంలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష ఆదివారం రాత్రి హత్యకు గురయ్యారు ఈ హత్య ఘటన అనంతరం కోపోద్రిక్తులైన భజరంగ్ దళ్ కార్యకర్తలు శివమొగ్గ నగరంలోని సీగేహట్టి ప్రాంతంలో పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. 
 
హిజాజ్ వివాదం నేపథ్యంలో విద్యాసంస్థలలో యూనిఫామ్ ఉండాలని ప్రచారం చేస్తుండడంతో పాటు, హిజాబ్ కు వ్యతిరేకంగా పేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టడంతో ఆగ్రహం చెందినవారు ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఎవ్వరు ఈ దురాగతానికి పాల్పడ్డారో ఇంకా తెలియలేదు. 
ఈ హత్య ఘటనతో శివమొగ్గలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ హత్య ఘటనపై శివమొగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివమొగ్గ నగరంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు
భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను ముస్లిం గూండాలు హత్య చేశారని కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులు కత్తితో పొడిచి చంపారని మంత్రి చెప్పారు. హిజాబ్ నిరసనల సమయంలో చేసిన వ్యాఖ్యల వల్ల హర్ష హత్యకు ప్రేరేపించారని మంత్రి ఆరోపించారు.
ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే  శివకుమార్ ముస్లిం గూండాలను రెచ్చగొట్టారని మంత్రి ఆరోపించారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య అనంతరం ఆందోళన కారులు వాహనాలకు నిప్పు పెట్టడంతో పోలీసు భద్రతను పెంచారు. కళాశాలలు, పాఠశాలలను మూసివేశారు. ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
హత్య వెనుక ఉన్నవారిని ఇంకా గుర్తించలేదని, శివమొగ్గలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు.కాగా హర్ష హత్యకు హిజాబ్ వివాదానికి సంబంధం ఉందనే వార్తలను ఓ పోలీసు అధికారి ఖండించారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో ఆధారాలు కనుగొన్నామని, త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. హర్ష,  యువకుల ముఠా ఒకరికొకరు తెలుసని, ఈ హత్య పాత కక్షల ఫలితంగా జరిగిందని భావిస్తున్నామని పోలీసు అధికారి చెప్పారు.