ఒకొక్క కాంగ్రెస్ నాయకుడి నిష్క్రమణ … ఆత్మపరిశీలనకై వత్తిడి 

ఇది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వంకోసం పోరాడుతున్న సమయంలో పార్టీ  సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అశ్వనీ కుమార్ కాంగ్రెస్ నుండి నిష్క్రమించడం మరోసారి పార్టీలో అలజడిని  రేకెత్తించింది. 
 
ఆయన నిష్క్రమణపై పార్టీ అధినాయకత్వం మౌనం వహిస్తుండగా, పార్టీలో ‘జి-23’ గ్రూపింగ్ నాయకులు మరోసారి పార్టీ వ్యవహారాలపై నిరసన గళం విప్పారు.  ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు పరాభవం ఎదురైతే ఈ మరింత వివాదంపై దారితీసే అవకాశం ఉంది. సీనియర్లను నిర్లక్ష్యం చేసి కేవలం కొందరు యువజన కాంగ్రెస్ నేతలతో పార్టీ నడుపుదామనుకొంటున్నారని అంటూ ఒక సీనియర్ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పార్టీ నుండి “నాయకుడి తర్వాత నాయకుడు” నిష్క్రమిస్తున్నారని పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ప్రశ్నించారు.“తీవ్ర ఆందోళన కలిగించే విషయం” అని రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనేత ఆనంద్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.  లోక్‌సభ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ పార్టీ తీవ్రమైన,  నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
 
ఆగష్టు 2020 లో కాంగ్రెస్ అధ్యక్షుడి సోనియా గాంధీకి లేఖ వ్రాసిన 23 సీనియర్ నాయకులు  పార్టీలో సమూలంగా మార్పులు జరపాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా లేకుంటే మార్చి 10 తర్వాత పార్టీ పతనాన్ని ఎదుర్కొంటే.. ‘‘నాయకుడి తర్వాత నాయకులు పార్టీని వీడడం చాలా ఆందోళన కలిగించే విషయం కాగలదు. 
 
“దేశవ్యాప్తంగా వివిధ స్థాయిలలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలతో పాటు, నిష్క్రమించిన నాల్గవ లేదా ఐదవ మాజీ కేంద్ర మంత్రి అశ్వని కుమార్ అని నేను అనుకుంటున్నాను” అని ఆజాద్ తెలిపారు. 
 
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆజాద్,  రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడు అయినా ఆజాద్ ఈ నిష్క్రమణలకు కారణాన్ని కనుగొనడానికి కాంగ్రెస్ చాలా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇది చూపిస్తుందని ఒక విధంగా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించారు. 
 
ఈ నాయకులు ఏ వ్యక్తి, లేదా (ఏదైనా) పార్టీ ఆదేశాల మేరకు వెళ్తున్నారని చెప్పడం సరికాదు. పార్టీలో కొంత అశాంతి ఉండాలి (అది) హార్డ్‌కోర్ కాంగ్రెస్ నాయకులను కూడా అసౌకర్యానికి గురి చేస్తుంది. ”తీవారీ, వివేక్ తంఖా కుమార్ నిష్క్రమణను “విచారకరం” , “దురదృష్టకరం” అని పేర్కొన్నారు.
 
 హర్యానా మాజీ ముఖ్యమంత్రి, మరొక జి-23 నాయకుడు భూపీందర్ సింగ్ హుడా ట్వీట్ చేస్తూ “అశ్వనీ కుమార్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టారనే వార్త విచారకరం. దురదృష్టకరం. అతను పాత ప్రియమైన స్నేహితుడు. స్వాతంత్య్ర  సమరయోధుని కుటుంబానికి చెందినవాడు” అని తెలిపారు. 
 
 “మిస్టర్ అశ్వనీ కుమార్, నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కలిసి పనిచేశాము. అతనికి , నాకు అనేక విషయాలలో నాగరిక విభేదాలు ఉన్నాయి. అయితే, ఒక చిన్న కార్యకర్త పార్టీని వీడినా, అది ఆత్మపరిశీలనకు పిలుపునిస్తుంది” అని మనీష్ తివారి చెప్పారు. 
 
 “విలువైన సహోద్యోగి అశ్వనీ కుమార్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం బాధాకరం. నాలుగు దశాబ్దాల పాటు పార్టీకి సేవ చేసిన వ్యక్తిని వీడడం దురదృష్టకరం. సామూహిక ఆందోళన కలిగించే విషయం” అంటూ ఆనంద్ శర్మ ట్వీట్ చేశారు. 
 
బలమైన, ఐక్యమైన కాంగ్రెస్ దేశ ప్రయోజనాలలో ఉందని వాదిస్తూ, అది కార్యరూపం దాల్చడానికి ఆత్మపరిశీలన అవసరం అని ఆజాద్ హితవు చెప్పారు: “ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి” అని సూచించారు. అశ్వని కుమార్ కుటుంబానికి పార్టీతో  స్వాతంత్య్రం పూర్వం నుంచి అనుబంధం ఉన్నదని చెబుతూ, “అలాంటి వ్యక్తులు పార్టీ విడిచి వెళ్లారంటే ఉందని అర్థం” అని స్పష్టం చేశారు.