దాణ కుంభకోణం కేసులో దోషిగా లాలూ

జార్ఖండ్‌లోని రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆర్జేడీ  అధినేత  బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌తోసహా మొత్తం 110 మంది నిందితులు ఉన్నారు. 
 
అయితే జనవరి 29న డిఫెన్స్ తరపున వాదనలు పూర్తి చేసిన తర్వాత… సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. 1996లో వెలుగులోకి వచ్చిన ఈ దాణా కుంభకోణం కేసులో లాలు ప్రసాద్‌ యాదవ్‌ని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్థారణ చేస్తూ తీర్పును వెలువరించింది.
మంగళవారం సీబీఐ కోర్టు.. దాణ కుంభకోణంకి సంబంధించిన ఐదో కేసులో.. డోరాండా ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేసిననట్లు  నిర్ధారించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు మొత్తం దాణా కుంభకోణానికి సంబంధించి ఐదు కేసుల్లో దోషిగా తేలిన లాలూ యాదవ్ మంగళవారం ఉదయం న్యాయమూర్తి సికె శశి తీర్పును చదివేటప్పుడు కోర్టు హాలులో ఉన్నారు.
ఈ కేసులో మరో 98 మంది నిందితులు భౌతికంగా హాజరు కావాల్సి ఉండగా 24 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మిగిలిన వారిలో మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ధ్రువ్ భగత్ సహా 35 మందికి మూడేళ్ల జైలు శిక్ష పడింది.
ఈ కేసులో లాలూ యాదవ్‌తోపాటు మరో 39 మంది దోషులకు ఫిబ్రవరి 21న శిక్ష ఖరారు కానుంది. అయితే లాలు కి సంబంధించిన అన్ని కేసులు పశువుల మేత కోసం ఉద్దేశించిన ప్రభుత్వ నిధులను స్వాహా చేసినవే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆయన మొత్తం 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు.