దుమారం రేపిన కాశ్మీర్ పై హుండాయ్ ట్వీట్!

‘మన కశ్మీరీ సోదరుల త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి. స్వేచ్ఛ, స్వాతంత్య్రంల కోసం పోరాడుతున్న వారికి మనం అండగా నిలవాలి’ అని హ్యూందాయ్ పాకిస్థాన్‌ ట్వీట్‌ చేసింది. దాల్‌ సరస్సులో ప్రయాణిస్తున్న ఓ పడవ చిత్రాన్ని పోస్టు చేసింది. అందులో కశ్మీర్‌ అనే అక్షరాలు రెండు దేశాల సరిహద్దుల్లో ఉండే ముళ్ల తీగల్లో ఉంటాయి.

ఏటా ఫిబ్రవరి 5న పాకిస్థాన్‌ ‘కశ్మీర్‌ సంఘీభావ దినోత్సవం’ నిర్వహిస్తుంది. ఇదే సమయంలో హ్యుందాయ్‌ పాకిస్థాన్‌ కశ్మీర్‌కు మద్దతుగా యాడ్‌ ఇవ్వడం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. వారు వెంటనే హ్యుందాయ్‌ ఇండియా, హ్యుందాయ్‌ గ్లోబల్‌కు ట్యాగ్‌ చేస్తూ ప్రశ్నించడం మొదలు పెట్టారు.

అందుకు వారు సమాధానం ఇవ్వకుండా నెటిజన్లను బ్లాక్‌ చేయడం మొదలు పెట్టారు. దాంతో #BoycottHyundai అని ట్రెండ్‌ చేస్తున్నారు. ఇలా బ్లాక్‌ చేయడంతో తాను హ్యూందాయ్‌ కస్టమర్‌ అయినందుకు సిగ్గుపడుతున్నానని, మరోసారి ఆ కంపెనీ కార్లను కొనబోనని ట్వీట్‌ చేశాడు.

హ్యుండాయ్ తో పాటు వినీత్ జిందాల్ అనే న్యాయవాది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి, వాటి లైసెన్స్ లను రద్దు చేయాలనీ డిమాండ్ చేయడంతో ఆయా కంపెనీలపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం కూడా హ్యుండాయ్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. దానితో ఆ కంపెనీలు తమ ట్వీట్ లను ఉపసంహరించుకొని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాయి. 

మరోవంక, సియోల్ లోని భారత రాయబారి దక్షిణ  కొరియా ప్రభుత్వ ప్రతినిధులను కలసి భారత్ నిరసనను వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆ దేశపు రాయబారిని విదేశాంగ  శాఖ పిలిపించి, మన అసంతృప్తిని వ్యక్తం చేసింది. దానితో దక్షిణ కొరియా దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయు-యోంగ్ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కు ఫోన్ చేసి జరిగిన “పొరపాటు” కు విచారం వ్యక్తం చేశారు.

“కాశ్మీర్ సాలిడారిటీ డేకు మద్దతు తెలుపుతూ హ్యుందాయ్ పాకిస్తాన్ చేసిన సోషల్ మీడియా పోస్టును మేము చూశాము. ఈ సోషల్ మీడియా పోస్ట్ గురుంచి ఆదివారం, 6 ఫిబ్రవరి 2022న, సియోల్’లోని మా రాయబారి హ్యుందాయ్ హెడ్ క్వార్టర్స్ సంప్రదించి వివరణ కొరాము. ఆ వెంటనే సోషల్‌మీడియా నుంచి పోస్ట్‌ను వారు డిలీట్‌ చేశారు. సోషల్‌మీడియాలో వచ్చిన అనుచితపోస్టుపై భారత్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. దేశ భౌగోళిక సమగ్రతకు సంబంధించి విషయాల్లో రాజీపడేది లేదని గట్టిగా స్పష్టం చేశాం. దీనిపై కంపెనీ తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం” అని అరీందమ్‌ బాగ్బీ ఓ ప్రకటనలో వెల్లడించారు.

భారత ప్రజలకు హ్యుందయ్‌ క్షమాపణలు

హ్యుందయ్‌ మంగళవారం ట్విటర్‌లో క్షమాపణలు తెలిపింది. ‘‘రాజకీయ లేదా మతపరమైన అంశాలకు దూరంగా ఉండటం మా సంస్థ విధానం. పాకిస్థాన్‌లో డీలర్‌ అనధికారికంగా కశ్మీర్‌ గురించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఆ ట్వీట్‌లను తొలగింపచేశాం. అతడు చేసిన పనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని సంస్థ తెలిపింది.