అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు

ఏఐఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ కారుపై గుర్తు తెలియని కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కిథౌర్‌లో ఇద్దరు వ్యక్తులు ఒవైసీపై కారుపై కాల్పులకు పాల్పడ్డారు.  దుండగులు మూడు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. 3 లేదా 4 తూటాలు కారు కింది భాగంలోకి దూసుకెళ్లాయి. మీరట్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
 
 ‘ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లోని కిథౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి బయలుదేరాను. ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంలో నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3 లేదా 4 రౌండ్ల బుల్లెట్స్ దూసుకెళ్లాయి. దాంతో నా వాహణం టైర్లు పంక్చర్ అయ్యాయి’ అని ఒవైసి తెలిపారు. 
 
దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు, నలుగులు ఉన్నారని, తానువేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయానని  చెప్పారు.  కాల్పుల తర్వాత తుపాకులు ఘటనాస్థలంలో వదిలి దుండగులు పరారైనట్లు సమాచారం. 
 
ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. కారుకు బుల్లెట్లు తగిలిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడికావాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలనికి చేరుకుని పరిశీలించారు.
‘‘కొద్ది సమయం క్రితం ఛిజారసీ టోల్ గేట్ వద్ద నేను ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిగాయి. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ముగ్గురు, నలుగురు వ్యక్తులు ఉన్నారు. కాల్పులు జరిపిన అనంతరమే అక్కడి నుంచి పారిపోయారు. నా కారు పంక్చ ర్ అయింది. అనంతరం నేను వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాను. మేమంతా క్షేమంగా ఉన్నాం’’ అని ఓవైసీ సంఘటన అనంతరం  ట్వీట్ చేశారు.
ఒవైసీపై దాడి చేసిన నిందితులు గత కొన్ని రోజులుగా ఆయన్ను వెంటాడారని పోలీసుల దర్యాప్తులో తేలింది.సభలు, ర్యాలీల్లో అసదుద్దీన్ చేసిన ప్రసంగాలతో విసిగిపోయిన నిందితులు సచిన్, శుభంలు ఒవైసీపై దాడి చేశారని పోలీసులు చెప్పారు. నిందితులు మీరట్ ర్యాలీతో పాటు గతంలో ఒవైసీ పాల్గొన్న పలు బహిరంగ సభలకు హాజరై, దాడికి పథకం పన్నారని సమాచారం.
ఒవైసీపై దాడి చేసిన నిందితులు మీరట్ ర్యాలీలో పాల్గొన్నారనే సమాచారంతో పోలీసులు ర్యాలీకి సంబంధించిన సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.నిందితులిద్దరూ గత కొన్ని రోజులుగా ఒవైసీని వెంబడిస్తున్నారని, అయితే ఆయనపై దాడి చేసే అవకాశం రాలేదని పోలీసులు చెప్పారు.