పాక్‌ ఆధారిత యూట్యూబ్‌ ఛానెళ్ల బ్లాక్‌

కేంద్రం బారత్‌కి విరుద్ధంగా ఫేక్‌ ఇన్ఫర్మేషన్‌ని ఇస్తున్న పాక్‌ ఆధారిత యూట్యూబ్‌ ఛానెళ్లను సుమారు 35  బ్లాక్‌ చేసింది. బ్లాక్‌ చేసిన ఛానెళ్ల కంటెంట్‌లో భారత సాయుధ బలగాలు, కాశ్మీర్, భారత్‌ విదేశీ సంబంధాలు, మాజీ సీడీఎస్‌ బిపిన్ రావత్ మరణం వంటి విషయాలకు సంబంధించి ఫేక్‌ ఇన్ఫర్మేషన్‌ ఉందని కేంద్రం తెలిపింది.

ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ  35 యూట్యూబ్ ఛానెల్‌లు, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, రెండు వెబ్‌సైట్లు, ఒక ఫేస్‌బుక్ ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విక్రమ్ సహాయ్ శుక్రవారం తెలిపారు. 

అయితే ఈ ఖాతాలన్నీ పాకిస్తాన్‌ నండి పనిచేస్తాయని, పైగా భారత్‌కి వ్యతిరేకంగా నకిలీ వార్తలను, కంటెంట్‌లను వ్యాప్తి చేయడమే ముఖ్యోద్దేశం అని పేర్కొన్నారు. అంతేకాదు బ్లాక్‌ చేసిన ఖాతాలకు సుమారు 130 కోట్ల వ్యూస్‌, దాదాపు 1.2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని విక్రమ్‌ సహాయ్‌  తెలిపారు.

ఈ మేరకు బ్లాక్‌ చేసిన ఖాతాలలో  అప్నీ దునియా నెట్‌వర్క్ 14 యూట్యూబ్ ఛానెల్‌ళ్లను నిర్వహిస్తోందని, తల్హా ఫిల్మ్స్ నెట్‌వర్క్ 13 యూట్యూబ్ ఛానెళ్లను నిర్వహిస్తున్నాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 2021 నిబంధన16 ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఈ ఖాతాలు ఉల్లంఘించాయని పేర్కొంది.