ఐదేళ్లలోపు చిన్నారులకు మాస్క్‌ తప్పనిసరి కాదు

ఐదేళ్లలోపు చిన్నారులకు మాస్క్‌ తప్పనిసరి కాదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ సమయంలో మాత్రమే ఆరేళ్ల నుంచి 11 ఏళ్ల వయస్సు పిల్లలు మాస్క్‌ ధరించేలా చూడాలని సూచించింది. కరోనా మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది.

అయితే, ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సుఉన్నవారు పెద్దలలాగానే మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని కేంద్రం తెలిపింది.

 
 ఇతర దేశాల నుంచి అందుబాటులో ఉన్న డేటా వివరాల ప్రకారం.. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల వచ్చే వ్యాధి తీవ్రత తక్కువగా ఉందని, కరోనా ఇన్ఫెక్షన్‌ తీవ్రతతో సంబంధం లేకుండా 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి యాంటీవైరల్‌ లేదా మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ వాడొద్దని కేంద్రం సూచించింది. 
 
స్టెరాయిడ్స్‌ను సరైన సమయంలో, సరైన మోతాదులో సరైన వ్యవధిలో వాడాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
మేఘాలయ ముఖ్యమంత్రికి కరోనా
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఓ ట్వీట్‌లో ధ్రువీకరించారు. ప్రస్తుతం తాను ఐసొలేషన్‌లో ఉన్నానని తెలిపారు. స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ కొద్దిరోజులు ఐసొలేషన్‌లో ఉంటానని చెప్పారు. ఇటీవల కాలంలో తనను కలుసుకున్న వారు తమకు ఎలాంటి లక్షణాలు కనిపించినా తక్షణం వైద్యపరీక్షలు చేయించుకోవాలని సంగ్మా సూచించారు.
టీమిండిమా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని అతను తన ట్విట్టర్లో వెల్లడించారు. ‘నాకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను .అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారు వీలైనంత త్వరగా కోవిడ్ టెస్టు  చేయించుకోవాలి. దయచేసి సురక్షితంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు.  
ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, టీమిండియా ప్లేయర్ వాషింగ్టన్ సుందర్, మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ లకు కరోనా వచ్చింది.