అడుగడుగునా మతం మారమని అవమానాలు…

“మీరు ప్రాణం లేని రాతిని దేవుడుగా కొలుస్తారు. ఈ రాయి మీ కష్టాలను తీరు స్తుందా? మీరు మా మతం లోకి వచ్చేయండి.” అంటూ జోరీగల్లా గొడవ చేస్తున్నారని, అడుగడుగునా అవమానాలకు గురిచేస్తున్నారని అంటి తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలంకు చెందిన ఓ గిరిజన మహిళా ఆవేదన వ్యక్తం చేసింది. 

తమ బంధువులు కొందరు మతం మారిపోయారని చెబుతూ .హిందువులుగా ఉన్న తమకు అండగా ఎవరున్నారు? అంటూ ఆమె ప్రశ్నించారు. తిరుమల శ్రీవారిని  చూడాలని ఎప్పటి నుండో ఏర్పర్చుకున్న కోర్కె ఈనాటికి తీరినదని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సమరసతా సేవ ఫౌండేషన్ వినతి మేరకు టిటిడి ఎస్సి/ఎస్టీ భక్తులకు ఈ ఎంలలో వైకుంఠద్వారం నుండి తిరుమలలో శ్రీవారి దర్శనం అవకాశం కల్పించడంతో ఆమె ప్రత్యేకంగా వచ్చారు. 

“ఇప్పటికి మా కోరిక నెరవేరింది.ఈ వెంకన్న స్వామినే నమ్ముకున్నాము. మాకు అండ కావాలి” అని కన్నీళ్ళతో ఆ 60 ఏళ్ల గిరిజన మహిళ తన అనుభవాన్ని, ఆవేదనను టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి  ధర్మారెడ్డికి వివరించింది. తిరుమల మాధవం భవనంలో తూర్పుగోదావరి జిల్లా మారెడుమల్లి గిరిజన ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో వారి అనుభవాలను తెలుసుకోవడం కోసం  ధర్మారెడ్డి గారు సమావేశమయ్యారు.

“ఈ పవిత్ర తిరుమల పుణ్య క్షేత్రంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 60 మంది పీఠాధిపతులు ,స్వామీజీలు కలిసి నేడూ హిందూ ధర్మ ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. ఈ పనిని సమరసత సేవా ఫౌండేషన్ చేయాలని స్వామీజీలు ఆదేశించారు. వారి ఆదేశం మేరకు ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని జిల్లాలలో గ్రామ గ్రామాన, మారు మూల పూరి  గుడిసెల  వరకు, ప్రతేకంగా ఎస్సీ,ఎస్టీ ప్రాంతాలలో సనాతన ధర్మ ప్రచారం చేస్తున్నది” అని సమరసతా జాతీయ కన్వీనర్ కె శ్యామ్ ప్రసాద్ తెలిపారు. 

ఈ కృషిలో టిటిడి తమకెంతో సహకరిస్తున్నదని చెబుతూ  ఎస్సీ.,ఎస్టీ.,మత్స్యకార కాలనీల్లో 502 దేవాలయాల నిర్మించడం, అక్కడి పూజారులకు తర్ఫీదు ఇవ్వడం, ఈ దేవాలయాల వద్ద శ్రీనివాస కల్యాణం వంటి  ఎన్నో కార్యక్రమాలు చేయడం చేస్తున్నట్లు ఆయన వివరించారు.  

నేడు తూర్పు గోదావరి జిల్లా నుండి వచ్చిన ఒక గిరిజన మహిళ హిందువులుగా ఉన్న మాకు అండగా ఎవరున్నారు? అన్న ప్రశ్నకు రాష్ట్ర దేవాదాయ శాఖ, టిటిడి, రాష్ట్రంలోని  స్వామీజీలు, ధార్మిక సంస్థలు అండగా ఉండాల్సిన అవసరం లేదా? మనం మనలను ప్రశ్నించుకోవాలి? ఈ హిందూ ధర్మ ప్రచారంలో టిటిడి మరింతగా  సహకరించాలని ఆయన కోరారు. 

కాగా, రాష్ట్రంలోని 502 దేవాలయాల పరిధిలోని ఎస్సీ.,ఎస్టీ., మత్స్యకార ప్రజలకు సంవత్సరంలో రెండు సార్లు తిరుమల స్వామి వారి దర్శనం ఏర్పాట్లు చేస్తామని ధర్మారెడ్డి హామీ ఇచ్చారు.  మిగిలిన సమయంలో మీ ద్వారా,   మీ ఏర్పాటు తో తిరుమలకు వస్తే తాము వసతి, దర్శనం ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.