ఐఆర్‌ఇడిఎకి రూ.1500 కోట్ల నిధులు

దేశీయ పునరుత్పాదక ఇంధన వృద్ధి సంస్థ (ఐఆర్‌ఇడిఎ)కి రూ.1500 కోట్ల నిధులను కేంద్ర కేబినెట్ మంజూరు చేసింది.  కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, పురుత్పాదక శక్తి రంగంలో ఐఆర్‌ఇడిఎ పెద్ద పాత్ర పోషిస్తోందని తెలిపారు.
 
 ఈ సంస్థ ఆర్థిక పునరుత్పాదక శక్తికి స్థాపించిందని, ఇది గత ఆరు సంవత్సరాల్లో రూ.8,800 కోట్ల నుంచి రూ.28 వేల కోట్లకు పెరిగిందని ఆయన చెప్పారు. ఆర్‌బిఐ ప్రకారం, 20 శాతం నికర విలువపై మాత్రమే రుణం ఇవ్వడం జరుగుతుందని, ఐఆర్‌ఇడిఎ నికర విలువ రూ.3000 కోట్లుగా ఉంది. అంటే రూ.600 కోట్లు మాత్రమే రుణం అందుతుందని ఠాకూర్ వివరించారు. 
 
కాగా, సఫాయీ కర్మచారీల జాతీయ కమిషన్(ఎన్‌సిఎస్‌కె) పదవీకాలాన్ని మరో మూడేళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తతీకున్నది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ  అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నదని అనురాగ్‌ఠాకూర్ తెలిపారు. 
 
కేబినెట్ నిర్ణయంతో ఎన్‌సిఎస్‌కె 2025 మార్చి 31వరకు కొనసాగనున్నది. పారిశుధ్య కార్మికుల స్థితిగతులపై పరిశీలన, సిఫారసుల కోసం ఈ కమిషన్‌ను 1994లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రాజ్యాంగేతర సంస్థగా సామాజిక న్యాయశాఖ కింద కమిషన్ పని చేస్తోంది. పారిశుధ్య కార్మికుల మెరుగైన జీవితం కోసం కమిషన్ సూచనలు చేస్తుంది.