బీజేపీలో చేరిన బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్

ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన తొలి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ సోదరుడు కల్నల్ విజయ్ రావత్ (రిటైర్డ్) ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు బుధవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. తన చేరిక తర్వాత విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, కల్నల్ రావత్ భారతదేశం పట్ల ప్రధాని మోదీకి ఉన్న దార్శనికత తనను పార్టీలో చేరడానికి ప్రేరేపించిందని చెప్పారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక పదవీ విరమణ చేసిన తర్వాత బిజెపిలో చేరిన తన తండ్రికి బిజెపితో గల సంబంధాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.   “ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడను. ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు, మా నాన్న బలవంతంగా పదవీ విరమణ చేసిన తర్వాత, బిజెపిలో ఉన్నారు. ఇప్పుడు నేను పదవీ విరమణ చేసిన తర్వాత, నాకు అదే అవకాశం లభించింది” అంటూ తెలిపారు.
” ప్రధాని మోదీ విజన్,  కలలు భారతదేశంను  చాలా ముందుచూపుతో ప్రతి పని దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఉంటుంది. ఇది నాకు బిజెపిలో చేరడానికి ప్రేరణనిచ్చింది” అని కల్నల్ రావత్ పేర్కొన్నారు.

“నేను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి కూడా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అతని నాయకత్వం,  విజన్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఉత్తరాఖండ్‌ను గొప్ప ఎత్తులకు తీసుకెళ్లడానికి ఆయన పనిచేస్తున్నారు. ఇది స్వల్పకాలిక దృష్టి కాదు, దీర్ఘకాలిక కార్యక్రమం” అని కొనియాడారు. 

దివంగత సిడిఎస్ సోదరుడు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని న్యూఢిల్లీలో కలిసిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ట్విటర్‌లో, సిఎం ధామి రావత్ కుటుంబం దేశం పట్ల వారి సేవ,  అంకితభావాన్ని ప్రశంసించారు.

రాష్ట్రంలో ఒకే దశలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనుండగా, మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.2017 ఎన్నికల్లో హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ బీజేపీ చేతిలో ఓడిపోయింది. 70 మంది సభ్యుల సభలో  బిజెపి 57 స్థానాలను గెలుచుకోగా, పాత పార్టీ 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.  ఇతర పార్టీలు మిగిలిన రెండు స్థానాలను పొందాయి. 

 
ఎన్నికల  తర్వాత, త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఆయన  మార్చి 9, 2021 వరకు కొనసాగారు. ఆయన  స్థానంలో తిరత్ సింగ్ రావత్ నియమితులయ్యారు. ఆయన  అతని పదవీకాలం అత్యున్నత పదవిలో స్వల్పకాలం కొనసాగింది. ఆయన  స్థానంలో పుష్కర్ సింగ్ ధామి నియమితులయ్యారు.