జీ ఛానల్ లో మోదీని కించపరిచే కామెడీ!

సంక్రాంతి పండుగ రోజున జీ తమిళ్ ఛానల్ లో  జూనియర్ సూపర్ స్టార్స్ ప్రోగ్రామ్‌లో చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీని  కించపరిచేలా వ్యంగ్యంగా కామెడీ చేయిస్తూ `నోటు బందు’ మోదీ  గారి పరిపాలన పై స్క్రిప్ట్ రాసి, అందులో పిల్లలచేత రాజకీయ విమర్శలు చేయించడం దుమారం రేపుతున్నది. 
 
 కరుపళనియప్పన్ అనే  హిందూ ద్వేషి దీనికి డైరెక్టర్. దీనిపై తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. తర్వాత గిండి పోలీసు స్టేషన్‌కు సంభందిత జీ టివి సిబ్బందిని పిలిచి మాట్లాడారు. 2011 యాక్ట్ ప్రకారం చిన్న పిల్లలను పెట్టి రాజకీయాలకు వాడకూడదు అని చట్టం ఉండటం వలన, ప్రధాని మోదీని  అవమానించేలా సన్నివేశాలు  ఉండడం,  విద్వేషాలు కలిగించేటట్లు ఉండడం వలన కేంద్రం నుండి ఆ  టీవీ చానెల్ కు నోటీసులు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాజు, మంత్రిగా నటించిన ఇద్దరు బాలలు ఊహాజనితమైన `శిందీయా’ రాజ్యం గురించి మాట్లాడతారు. అందులో రాజు నల్లధనంపై ప్రకటించిన యుద్ధం విఫలం అవుతుంది. దానిని నోట్ల రద్దు గురించి అవహేళన చేస్తూ ప్రదర్శించారని అంటూ బిజెపి అభ్యంతరం తెలిపింది. 
 
 దేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలోరాజు ఎంతగా ప్రజాదరణ కోల్పోయారో చెబుతూ ఆయన సింహాసనంపై లేకపోతే ప్రజలు సంతోషంగా ఉండేవారని మంత్రి చెబుతారు.   ఈ వ్యంగ్యానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఆదివారం నుండి వైరల్‌గా మారాయి. 
 
తమిళనాడు బిజెపికి చెందిన పలువురు నాయకులు జీ తమిళ్, షోలో ఉన్న న్యాయనిర్ణేతలు,  షోకు దర్శకత్వం వహించి,  నిర్మించడంలో పాల్గొన్న ఇతరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షోకు సంబంధించిన ఫిర్యాదు ఆధారంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సోమవారం సాయంత్రం కేంద్ర సమాచార,   ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది.  ఏడు రోజులలోపు సమాధానం ఇవ్వాలని ఛానెల్‌ని కోరింది.

ప్రధాని మోదీని అవమానించేలా కంటెంట్ ఉందంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సెటైర్‌పై మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు.  సెటైర్ షో ప్రధాని మోదీని చులకనచేసి చూపించిందని అంటూ  పేర్కొనగా  కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌ ఈ అంశంపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన ట్వీట్‌ చేశారు. 


జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి రాసిన లేఖలో, తమిళనాడు బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు సీటీఆర్ నిర్మల్ కుమార్, ప్రధానిపై ఉద్దేశ్యపూర్వకంగా అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు, ఆ ఛానల్, షో నిర్మాత, పిల్లల మెంటర్లు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
కంటెంట్‌కు బాధ్యత వహించే వ్యక్తి. “ఒకరి రాజకీయ ఎజెండా”ను ముందుకు తీసుకురావడానికి చిన్న పిల్లలను ఉపయోగించలేమని కూడా ఆయన స్పష్టం చేశారు.  “చానెల్ ఈ కఠోర తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదని స్పష్టంగా తెలుస్తుంది.  అది కూడా చిన్నపిల్లల ద్వారా. తమ తోటి నటులను అధిగమించే ప్రయత్నంలో, ఈ పిల్లలు వారికి చెప్పినట్లే చేస్తారు” అని నిర్మల్ కుమార్ తెలిపారు.