మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం

ప్రముఖ పండితుడు, పురాణ ప్రవచకులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యం చెందారు. అనారోగ్య సమస్యలతో మల్లాది తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉగాది పండుగ సమయంలో పంచాగం శ్రవణం చేసేవారు.
 
ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ, భారత, భాగవతాలపై ఆయనకున్న పట్టు కారణంగా పురాణప్రవచన ప్రముఖులలో ఆయన ప్రత్యేకమైన పేరు గాంచారు.  ఉగాది పంచాంగ శ్రవణం, పురాణ ఇతిహసాలను ప్రజలకు సులభంగా అర్థం అయ్యేలా ప్రవచనాలు చేసిన ఉభయ వేదాంత పండితులుగా పేరుగాంచారు
 
తన 15వ ఏట నుంచి ప్రారంభించిన ఈ ప్రవచన యజ్ఞం అసిధారావ్రతంగా ఇప్పటికీ కొనసాగింది.  87 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనం చేయడంలో మల్లాది చంద్రశేఖరశాస్త్రి సుప్రసిద్ధులు. దక్షిణమూర్తి దంపతులకు 1925 ఆగస్టు 28న హసనబడా గ్రామంలో ఆయన జన్మించారు. 
 
అభినవ వ్యాస అనే పుస్తకాన్ని రచించారు. ఆల్ ఇండియా రెడియో, శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్,  సప్తగిరి దూరదర్శన్ భక్తి చానెల్ లో వేధాలు, పురణాలకు సంబంధించిన ప్రవచనాలు చెప్పేవారు. తిరుమల తిరుపతి దేవస్థాన కళాశాలకు ప్రిన్సిపల్ గా  సేవలందించారు. 
 
2005వ సంవత్సరంలో ఆయనకు రాజ్యలక్ష్మి అవార్డు వరించింది. శృంగేరి శంకర్ మట్ వాళ్లు సవ్యసాచి అనే బిరుదు కూడా ఇచ్చారు. సనాతన ధర్మ ట్రస్ట్ ద్వారా ఎమినెంట్ సిటిజన్ అవార్డును అందుకోవడమే కాక మాజీ ప్రధాని పివి నరసింహరావుతో సత్కరించబడ్డారు.