మంత్రి అవంతి శ్రీనివాస్ కి క‌రోనా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రోజురోజుకు క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. తాజాగా,  ఏపీ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది.  త‌న‌కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌టంతో క‌రోనా టెస్ట్ చేయించుకోగా క‌రోనాగా నిర్థార‌ణ అయింద‌ని వెల్ల‌డించారు. దీంతో త‌న ఇంట్లో నే ఐసోలేష‌న్ లో ఉన్నట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు.
 
 అయితే త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంద‌రూ క‌రోనా నిర్ధార‌ణ పరీక్ష‌లు చేసుకోవాల‌ని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ కోరారు. అలాగే ల‌క్ష‌ణాలు ఉన్న వారు క్వారైంటెన్ లో ఉండాల‌ని విజ్ఞాప్తి చేశారు. అలాగే రాష్ట్ర ప్ర‌జ‌లు అంద‌రూ కూడా క‌రోనా, ఓమిక్రాన్ ప‌ట్ల జగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. 
ఏపీ వైద్యాధికారుల విడుద‌ల చేసిన హెల్త్ బులెటిన్ ప్ర‌కారం రాష్ట్రంలో కొత్తగా మ‌రో 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,93,860 కు చేరింది. ఇందులో 20,61,039 మంది కోరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 14,508 మంది మహమ్మారి కారణంగా మరణించారు.
 ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 18,313 గా ఉంది. కాగా గడిచిన 24 గంటల్లో 418 మంది కోవిడ్‌ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతులయ్యారని ఏపీ వైద్యాధికారులు పేర్కొన్నారు.కరోనాతో తాజాగా  ఒకరు మృతి చెందారు.