యుపి, ఉత్తరాఖండ్, గోవాలలో తిరిగి బీజేపీకే అధికారం!

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలలో తిరిగి బిజెపి అధికారంలోకి రాబోతోందని,  పంజాబ్ లో ఆప్ కు అవకాశాలున్నాయని వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై టైమ్స్ నౌ సంస్థ జరిపిన పోల్ సర్వే వెల్లడిస్తున్నది.  

ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని తెలిపింది. సమాజ్ వాది పార్టీ గతం కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది. ఇక బహుజన సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ కు యూపీలో గడ్డుపరిస్థితులే ఉంటాయని టౌమ్స్ నౌ సర్వే తేలింది. 

యోగి ఆదిత్యనాథ్  మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ 53.4 శాతం మంది కోరారని.. అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రి కావాలంటూ 31.5 శాతం మంది కోరితే.. ప్రియాంక గాంధీ యూపీ ముఖ్యమంత్రిగా ఉండాలంటూ 2.5 శాతం మంది కోరినట్లు తెలుస్తోంది. యూపీలో బీజేపీ సొంతంగా 227 నుంచి 254 స్థానాలు గెలవబోతుందని సర్వే తెలిపింది. 

బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమా? అనే ప్రశ్నకు 42.27ు మంది అవునని, 46.32ు మంది కాదని సమాధానమిచ్చారు. యూపీలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా సమాజ్‌వాదీ వైపు మొగ్గుచూపుతున్నారని ఒపీనియన్‌ పోల్‌ స్పష్టం చేసింది. 

ఇక పంజాబ్ లో ఆమ్ ఆద్మి పార్టీకి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయని తెలిపింది. ఆ పార్టీ నేత భగవంత్ మాన్ ను తదుపరి ముఖ్యమంత్రిగా చూస్తున్నారని సర్వేలో తేలింది. ఆమ్ ఆద్మీకి 54 నుంచి 58సీట్లు రాబోతున్నాయని తెలిపింది. కాంగ్రెస్ కు 41 నుంచి 47 సీట్లు ఛాన్స్ ఉంటే.. . ఇక శిరోమణి అకాలీదళ్‌కు 11-15 స్థానాలు, బీజేపీ-పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ కూటమికి 1-3 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 

ఉత్తరాఖండ్ లో బీజేపీకి మరో అవకాశం ఉందని తెలిపింది. ఆ పార్టీ 44 నుంచి 50 సీట్లు గెలువబోతుందని తెలిపింది. కాంగ్రెస్ కు 12 నుంచి 15 సీట్లు వస్తాయని తెలిపింది.  బీజేపీ నేత పుష్కర్ సింగ్ ధామి ను శక్తివంతమైన నేతగా ఉత్తరాఖండ్ ప్రజలు చూస్తున్నారని టౌమ్స్ నౌ ప్రకటించింది.  ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కు 5-8 సీట్లు వస్తాయని తెలిపింది. 

గోవాలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొంటూ బీజేపీకి 17 నుంచి 21 సీట్లు రాబోతున్నట్లు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ 8 నుంచి 11 స్థానాల్లో విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ సర్వే ప్రకటించింది. కాంగ్రెస్‌ 4-6 స్థానాలతో సరిపెట్టుకోనుందని వెల్లడించింది. గోవా వాసులు ముఖ్యమంత్రిగా ప్రమోద్‌ సావంత్‌కే జైకొట్టారని తెలిపింది.

కాగా, యూపీ మళ్లీ బీజేపీదేనని ఏబీపీ సీ ఓటర్ సర్వే కూడా తేల్చి చెప్పింది. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 235 స్థానాలు దక్కించుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 41.5% ఓటింగ్ శాతం దక్కవచ్చని ఒపీనియన్ పోల్‌ ద్వారా వెల్లడించింది. అఖిలేష్ సారధ్యంలోని సమాజ్‌వాదీ పార్టీకి 157, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 16, కాంగ్రెస్‌కు పది లోపు స్థానాల్లో విజయం దక్కవచ్చని సర్వే తేల్చింది.