ఆత్మకూరు సంఘటనపై సీఎం మౌనమై సోము విస్మయం 

ఆత్మకూరులో  ఒక వర్గంపై దాడి  చేయడాన్ని ప్రశ్నించిన బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుడ్డా శ్రీ కాంత్ రెడ్డి పై పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం, అతనిపైననే పోలీసులు కేసులు నమోదు చేయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
సంఘటన జరిగిన రెండు రోజులు అవుతున్నా ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించక పోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి వ్రాసిన బహిరంగ లేఖలో ఆత్మకూరు ఆంధ్రప్రదేశ్ లో ఉందా ?లేదా పాకిస్థాన్ లో ఒక భాగమని ముఖ్యమంత్రి భావిస్తున్నారా ? లేదా నిలదీశారు.
 
ఒక వర్గం వారి పై ఉద్దేశపూర్వకంగా ఒక పధకం ప్రకారం దాడి చేశారని చెబుతూ  ఒకవైపు ముఖ్యమంత్రి మౌనం, మరో వైపు ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు హిందువులపై కేసు లు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించడం వెనుక అర్థం తెలియనంతగా ఆత్మకూరు ప్రజానీకం లేరన్న సంగతి ముఖ్యమంత్రి తెలసుకోవాలలని ఆయన హెచ్చరించారు. 

అనుమతి లేకుండా మసీదు ఎలానిర్మాణం చేస్తారని వీర్రాజు ప్రశ్నించారు. ఇదే విషయాన్ని పోలీసులు సమక్షంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీ కాంత్ రెడ్డి ప్రశ్నిస్తే దాడి చేసి ప్రాణహాని తలపెట్టటానికి ప్రయత్నం చేసి , పోలీసులు పై దాడి చేయడం ,పోలీసు స్టేషన్ ధ్వంసం చేసిన సంఘటన పరిశీలిస్తే ఎవరు ప్రశ్నించరని భావించారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జరిగిన సంఘటన పై డిజిపి ఆలస్యంగా స్పందించడమే కాకుండాఈ సంఘటన లో గాయపడిన పోలీసులకు కనీస ధైర్యం చెప్పలేదంటే ముఖ్యమంత్రి మౌనం ప్రజలు అర్థం చేసుకుంటారని స్పష్టం చేశారు. జరిగిన సంఘటన పై ముఖ్యమంత్రి స్పందిస్తారని ఇప్పటి వరకు సహనంగా భాద్యత కలిగి న  పార్టీ గా ఎదురు చూసామని చెప్పారు.

మసీదు నిర్మాణం అంటే పదిమంది లేదా ఇరవై మంది ఉండాలి. వందల సంఖ్యలో అక్కడ ఏఉద్దేశ్యంలో ఉన్నారు?  యధేచ్చగా రాళ్ళ దాడి జరుగుతుంటే ఆర్మర్డ్ ఫోర్స్ ను అదనంగా ఎందుకు పంపలేదు?  ఇంతవరకు దాడి కి పాల్పడిన వారి పై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదు? అంటూ వీర్రాజు ప్రశ్నల వర్షం కురిపించారు. 

 
ఆత్మకూరు సంఘటనను  బిజెపి సీరియస్ గా తీసుకుంటుని ఆయన ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు.  ఈ విషయంలో ఎంతదూరమైనా వెడతామని పేర్కొంటూ శ్రీ కాంత్ రెడ్డి పై నమోదు చేసి న కేసు లు బేషరతుగా ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.

ఈ రాష్ట్రం మీజాగీర్ కాదని పేర్కొంటూ అక్రమనిర్మాణం చేయడమే కాకుండా, అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తుంటే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోలేదు కాబట్టి ప్రభుత్వం ఈసంఘటనలో ముద్దాయిగా నిలబడాలని బిజెపి నేత హెచ్చరించారు.

ఇలా ఉండగా, ఉపముఖ్యమంత్రి  అంజాద్‌ బాషా ఆత్మకూరు సందర్శించి ఆత్మకూరు ఘటనలో పలువురు విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారని చెబుతూ  ఈ విషయానిు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కేసులను ఎత్తివేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. తద్వారా దాడికి పాల్పడిన వారికి పరోక్షంగా ఆయన అభయమిచ్చారు.  
 
శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, ఎమ్మెల్సీ ఇసాక్‌ కూడా ఆయనతో పాటు ఉన్నారు.  దాదాపు 200 నుంచి 250 మంది ఈ ఘర్షణల్లో పాల్గొన్నట్లు గుర్తించామని ఎస్‌పి సిహెచ్‌.సుధీర్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకూ ఐదు కేసులు నమోదు చేసి 28 మందిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. 
 
పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ పునరావృతం కాకుండా 500 మంది పోలీసులు మోహరించారు. పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఆత్మకూరులో ఈ నెల 13వ తేదీ వరకూ 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ఆత్మకూరు తహశీల్దార్‌ ఎస్‌.ప్రకాష్‌ బాబు ఆదేశాలు జారీ చేశారు.