నూతన సంవత్సర ఆంక్షలు తెలంగాణ ప్రభుత్వం బేతాఖర్

నూతన సంవత్సర వేడుకలకు హైకోర్టు ఇచ్చిన ఆంక్షలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ప్రభుత్వ ఆంక్షలపై తెలంగాణ హైకోర్ట్‌లో బుధవారం పిల్ దాఖలైంది. 
 
హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణలో ఆంక్షలు పెట్టాలని హైకోర్ట్ ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్ చెప్పారు. 
 
ప్యాండమిక్, ఎపిడెమిక్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని కోర్టుకు పిటిషనర్ తెలిపారు.  ఇష్టానుసారంగా ప్రభుత్వం ఓమిక్రాన్‌ను కట్టడి చేయకుండా న్యూ ఇయర్ వేడుకలను అనుమతి ఇచ్చిందని కోర్ట్‌కు పిటిషనర్ చెప్పారు. 
 
తెలంగాణ వ్యాప్తంగా 62 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయని పిటిషనర్ కోర్ట్‌కు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలని పిటిషనర్ కోరారు. అయితే ఈ విషయంపై రేపు హై కోర్టు మరోసారి విచారించనుంది.
 
అర్ధరాత్రి దాటే వరకు మద్యం షాపులు తెరుచుకోవానికి, పబ్ లు వంటివి తెల్లవార్లూ తెరిచి ఉండడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతున్నది. మొత్తం దేశంలో కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే ఆంక్షలను పట్టించుకోవడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి.