కాంగ్రెస్ మునిగిపోతున్న నావ

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు ధోరణిలో చేసిన ట్వీట్‌లను కాంగ్రెస్‌ దుస్థితికి సంకేతంగా బీజేపీకి చెందిన ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి తీరత్‌సింగ్‌ రావత్‌ చిత్రీకరించారు.

కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు వీటన్నింటి గురించి ఆలోచించాలని,  కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని ఎద్దేవా చేశారు. సొంత పార్టీని మేనేజ్ చేయలేకపోతున్నారని విమరసంచారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టే స్థితిలో లేకపోవడంతో రాష్ట్రంలో బీజేపీ తదుపరి ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయగలదని ధీమా వ్యక్తం చేసారు. 
 
రానున్న రోజుల్లో ఓటర్లు వారిని పక్కదారి పట్టించనున్నారని స్పష్టం చేస్తూ ఈ అంతర్గత వివాదం గురించి వారి అధిష్ఠానం ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. అయితే, తిరత్ సింగ్ రావత్  రాజకీయ ప్రాముఖ్యత కోసం బేరసారాలు సాగిస్తున్నారని అంటూ ఆయన  ట్వీట్లను “రాజకీయ ఒత్తిడి” తీసుకు రావడం కొసమే అని స్పష్టం చేశారు.

“హరీష్ రావత్ విశ్రాంతి తీసుకోబోవడం లేదు. పార్టీలో తన ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకే ఇలా చేస్తున్నాడని భావిస్తున్నాను. తనకు ఎన్నికలే ప్రధానం కాబట్టే ఎన్నికలకు ఎన్నికలకు దూరంగా ఉండలేరు… ఒత్తిడి రాజకీయాలు చేయడంలో ఆయనకు పేరుంది. అతను చెప్పేది, చేసేది ఎవరికీ తెలియదు. ఆయన గతం గురించి ప్రజలకు తెలుసు’ అని తీరత్ సింగ్ రావత్ ధ్వజమెత్తారు.

“కాంగ్రెస్ ఎప్పుడూ చెల్లాచెదురుగా ఉంది. కుటుంబంలో ఇన్ని చీలికలు, అంతఃకలహాలు ఉన్న వారు బయటికి వెళ్లి ఎన్నికల్లో ఎలా పోరాడతారు? ఇలా ఎన్నిక‌ల‌ను ఎదుర్కోవ‌డం కాంగ్రెస్‌కు అంత సులువు కాద‌ని నా అభిప్రాయం. ఇది కచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మేలు చేస్తుంది” అంటూ మాజీ ముఖ్యమంత్రి భరోసా వ్యక్తం చేశారు.