ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలం పొడిగింపు

ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే పదవీకాలాన్ని కేంద్రం నెల రోజులు పొడిగించింది. ఆయన పదవీకాలం పొడిగింపునకు కేబినెట్‌ అపాయింట్‌మెంట్‌ కమిటీ ఆదివారం ఆమోదం తెలిపింది. జనరల్‌ మనోజ్‌ పాండే జూన్‌ 30 వరకు ఆర్మీ చీఫ్‌గా కొనసాగనున్నారు.  వాస్తవానికి ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది.
గతంలోనూ కేంద్రం పదవీ కాలాన్ని కొనసాగించింది. ఆయన ఏప్రిల్‌ 30, 2022న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్‌ ఎంఎం నరవణే స్థానంలో ఆర్మీ చీఫ్‌గా నియామకమయ్యారు.  అంతకు ముందు ఆయన కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఆర్మీ చీఫ్‌ అయిన తొలిసారి అధికారి మనోజ్‌ పాండే. ఇప్పటి వరకు, ఎక్కువగా పదాతిదళం, ఆర్మర్డ్ అండ్‌ ఆర్టిలరీ అధికారులు ఆర్మీ చీఫ్‌లుగా పని చేశారు. పాండే తూర్పు ఆర్మీ కమాండర్‌గా కూడా పని చేశారు. 
 
ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖను ఈ కమాండ్ మోహరించింది. దీని ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది. లెఫ్టినెంట్ జనరల్ పాండే తూర్పు కమాండ్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు అండమాన్ అండ్‌ నికోబార్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్‌గా సేవలు అందించారు.