ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్ ఫైన‌ల్ సమరం నేడే

* చెన్నైలో భారీ వర్షంతో ఆందోళన
 
నెల‌న్న‌ర రోజులుగా అభిమానుల‌ను అల‌రిస్తున్న ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్ ఫైన‌ల్  టోర్న విజేత ఎవ‌రో మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోనుంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మూడో ఫైన‌ల్ కాగా.. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు ఇది నాలుగోది. సంచ‌ల‌నాల‌కు నెల‌వైన టీ20ల్లో ట్రోఫీని ముద్దాడేది ఎవ‌రో ఊహించ‌డం క‌ష్ట‌మే.  స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ , కోల్‌క‌తా ఫైన‌ల్ ఫైట్‌ మే 26 ఆదివారం చెపాక్‌లో తీవ్ర ఆసక్తి కలిగిస్తున్నది.
 
అయితే.. లీగ్ ద‌శ‌లో, క్వాలిఫ‌య‌ర్ 1లో హైద‌రాబాద్‌ను ఓడించిన కోల్‌క‌తా మ‌రోసారి అదే ఫ‌లితాన్ని పున‌రావృతం చేయాల‌ని  అనుకుంటోంది. నాకౌట్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో రాజ‌స్థాన్‌ను ఇంటికి పంపిన హైద‌రాబాద్.. టైటిల్ పోరులో కోల్‌క‌తాకు షాకివ్వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది.
ప‌దిహేడో సీజ‌న్‌లో సంచ‌న‌ల బ్యాటింగ్ ప్ర‌దర్శ‌న‌తో హైద‌రాబాద్ అద‌రగొడితే.. కోల్‌క‌తా ఓపెన‌ర్ల విధ్వంసం, స్పిన్ అస్త్రంతో ప్ర‌త్య‌ర్థుల‌ను వ‌ణికిచింది. స‌న్‌రైజ‌ర్స్‌కు ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌లు కొండంత అండగా నిలుస్తున్నారు. ఈ సీజ‌న్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఈ జోడీ రెండో వేగ‌వంత‌మైన (16 బంతుల్లోనే) హాఫ్ సెంచ‌రీల‌తో రికార్డు నెల‌కొల్పింది.
 
ప‌దిహేడో సీజ‌న్‌లో సంచ‌న‌ల బ్యాటింగ్ ప్ర‌దర్శ‌న‌తో హైద‌రాబాద్ అద‌రగొడితే.. కోల్‌క‌తా ఓపెన‌ర్ల విధ్వంసం, స్పిన్ అస్త్రంతో ప్ర‌త్య‌ర్థుల‌ను వ‌ణికిచింది. స‌న్‌రైజ‌ర్స్‌కు ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌లు కొండంత అండగా నిలుస్తున్నారు. ఈ సీజ‌న్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఈ జోడీ రెండో వేగ‌వంత‌మైన(16 బంతుల్లోనే) హాఫ్ సెంచ‌రీల‌తో రికార్డు నెల‌కొల్పింది.

అయితే.. గ‌త రెండు మ్యాచుల్లో ఈ ఇద్ద‌రూ త‌మ మార్క్ ఇన్నింగ్స్ ఆడ‌లేక‌పోయారు. మ‌రోవైపు కోల్‌క‌తాకు ఓపెన‌ర్ అవ‌తార‌మెత్తిన ఆల్‌రౌండ‌ర్ సునీల్ న‌రైన్ త‌ర‌గ‌ని ఆస్తిలా మారాడు. సైలెంట్‌గా సిక్స‌ర్లు కొడుతూ కేకేఆర్‌కు శుభారంభాలు ఇస్తున్నాడు. మ‌రోవైపు ఫిలిప్ సాల్ట్ స్థానంలో వ‌చ్చిన ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్ సైతం భారీ షాట్ల‌తో అలరిస్తున్నాడు.

మిడిలార్డ‌ర్‌లో ఆరెంజ్ ఆర్మీ హిట్ట‌ర్లు హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డిలు దంచుతుంటే.. వెంక‌టేశ్ అయ్య‌ర్, శ్రేయ‌స్ అయ్య‌ర్, ఆండ్రూ ర‌స్సెల్‌లు కేకేఆర్ త‌ర‌ఫున మెరుపులు మెరిపిస్తున్నారు. ఇక‌ బౌలింగ్ విష‌యానికొస్తే.. మిచెల్ స్టార్క్ నాకౌట్ మ్యాచుల్లో బెంబేలెత్తిస్తున్నాడు. క్వాలిఫ‌య‌ర్ 1లో హెడ్‌ను డ‌కౌట్ చేసిన మిస్సైల్ స్టార్క్‌ ఆ త‌ర్వాత నితీశ్ కుమార్, షాబాజ్‌ల‌ను వెన‌క్కి పంపి క‌మిన్స్ సేన ఓట‌మికి నాంది ప‌లికాడు. 

దాంతో, క్వాలిఫ‌య‌ర్ 2లో మ‌రోసారి ఈ ఆసీస్ స్పీడ్‌స్ట‌ర్ నుంచే హైద‌రాబాద్ టాపార్డ‌ర్‌కు ముప్పు పొంచి ఉంది. ప‌వ‌ర్ ప్లేలో యార్క‌ర్ల‌తో వ‌ణికించే స్టార్క్‌ను హెడ్, అభిషేక్‌లు ఏమేర‌కు ఎదుర్కొంటారు? అనేది కీల‌కం. స‌న్‌రైజ‌ర్స్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌లో న‌ట‌రాజ‌న్  మిన‌హాయిస్తే.. భువ‌నేశ్వ‌ర్, ఉనాద్కాట్‌లు వికెట్లు తీయ‌లేక‌పోతున్నారు. క‌మిన్స్ సైతం ధారాళంగా ప‌రుగులివ్వ‌డం ఆరెంజ్ ఆర్మీని కలువ‌ర‌ప‌రుస్తోంది.

ఈ సీజ‌న్‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి(20 వికెట్లు), సునీల్ న‌రైన్‌(16 వికెట్లు)లు తిప్పేస్తున్నారు. ఈ ఇద్ద‌రు నిఖార్సైన‌ స్పిన్న‌ర్లతో ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ పెడుతూ వ‌స్తున్న‌ కోల్‌క‌తా ఫైన‌ల్లోనూ వీళ్ల‌నే న‌మ్ముకుంది. బంతి గింగిరాలు తిరిగే చెపాక్ పిచ్‌పై ఈ స్పిన్ ద్వ‌యం సన్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లను ఇరుకున పెట్ట‌డం ఖాయం. 

మ‌న‌ హైద‌రాబాదీ లెఫ్టార్మ్ స్పిన్న‌ర్లు షాబాజ్, అభిషేక్‌లు క్వాలిఫ‌య‌ర్ 2లో రాజ‌స్థాన్ ఫైన‌ల్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. ఫైన‌ల్లోనూ వీరిద్ద‌రూ చెల‌రేగితే హైద‌రాబాద్‌కు విజ‌యావ‌కాశాలు ఉన్న‌ట్టే. ఇక కెప్టెన్సీ ప‌రంగా చూస్తే.. నిరుడు రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన క‌మిన్స్ త‌న వ్యూహాల‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్‌ పై పైచేయి సాధించే చాన్స్ ఉంది. అదే జ‌రిగితే స‌న్‌రైజ‌ర్స్ ఖాతాలో రెండో ట్రోఫీ చేరిన‌ట్టే.

ఇలా  ఉండగా,శ‌నివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావ‌ర‌ణం మారిపోయింది. ఉరుములతో, మెరుపులతో చినుకులు మొద‌ల‌య్యాయి. ఊహించ‌ని వ‌ర్షం రాక‌తో అప్ర‌మ‌త్త‌మైన చెపాక్ స్టేడియం సిబ్బంది ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌తో పిచ్ మొత్తాన్ని క‌ప్పి వేశారు. వాన ఎంత‌కూ త‌గ్గ‌కపోవ‌డంతో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఆట‌గాళ్లు త‌మ ప్రాక్టీస్ సెష‌న్‌ను ర‌ద్దు చేసుకున్నారు. 

ఆదివారం ఫైన‌ల్ మ్యాచ్‌కు వాన ముప్పు తప్ప‌క‌పోవ‌చ్చు అని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఆదివారం నాడు వాన ప‌డేందుకు 3 శాతం అవకాశం ఉంద‌ట‌. అంతేకాదు ఆ రోజంతా 97 శాతం వ‌ర‌కు మేఘాలు క‌మ్మి ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.  ఒక‌వేళ వాన కార‌ణంగా ఆదివారం ఆట సాధ్యం కాకుంటే రిజ‌ర్వ్ డే ఎలాగూ ఉండ‌నే ఉంది. 26న కొన్ని ఓవర్ల త‌ర్వాత చినుకులు ప‌డితే.. య‌థావిధిగా మ‌రునాడు మ్యాచ్ ఆడిస్తారు