ఫైన‌ల్లో స‌న్‌రైజ‌ర్స్ చిత్తు.. కోల్‌క‌తాకు మూడో టైటిల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ఆద్యంతం ఉత్కంఠగా సాగినప్పటికీ ఏకపక్షంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను చిత్తు చేసి టైటిల్ నెగ్గింది కోల్‌కతా నైట్ రైడర్స్. సన్‌రైజర్స్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. స్వ‌ల్ప ఛేద‌న‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్(52 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచ‌రీ బాద‌గా 8 వికెట్ల‌తో గెలుపొందిన కోల్‌క‌తా స‌గ‌ర్వంగా మూడో టైటిల్ ఖాతాలో వేసుకుంది.
 
నరైన్ (6) రెండో ఓవర్లోనే అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (39), వెంకటేశ్ అయ్యర్ (52*) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆఖర్లో గుర్బాజ్ అవుట్ అయినప్పటికీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో (6) కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు వెంకటేశ్ అయ్యర్. దీంతో కేవలం 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది.
 
ఐపీఎల్- 2024 మొత్తం అదరగొట్టిన కోల్‌కతా బౌలర్లు ఫైనల్లో అంతకుమించి చెలరేగడం విశేషం. ఏ దశలోనూ సన్‌రైజర్స్‌ను కోలుకోనివ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ రైజర్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది.
 
కోల్‌కతాకు ఇది మూడో ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం. అంతకుముందు 2012, 2014లో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో ఐపీఎల్ టైటిల్స్ నెగ్గింది. 2021లోనూ ఫైనల్ చేరినా.. చెన్నై చేతిలో ఓడిపోయింది. ఇక సన్‌రైజర్స్‌కు ఐపీఎల్ ఫైనల్లో రెండోసారి ఓటమి ఎదురైంది. 2016లో టైటిల్ గెలవగా.. 2018, 2024ల్లో ఓటమి పాలైంది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ పూర్తి ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. 18.3 ఓవర్లలోనే 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఐపీఎల్ ఫైనల్లో ఇప్పటివరకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఈ చెత్త రికార్డు ఉంది. ఆ టీం 2013 ఫైనల్లో 125 రన్స్ చేసింది. ఇక ఐపీఎల్ మొత్తం మీద సన్‌రైజర్స్‌కు ఇది మూడో అత్యల్ప స్కోరు. 2019లో ముంబైపై 96, 2015లో అదే జట్టుపై 113 పరుగులు చేయగా.. ఇప్పుడు కూడా అంతే స్కోరు చేసింది.

 
ప‌దిహేడో సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు తేలిపోయారు. క్వాలిఫ‌య‌ర్ 1లో ఓటమికి ప్ర‌తీకారంగా క‌సితీరా కొడ‌తారనుకుంటే చాప చుట్టేశారు. చెపాక్‌లో ఎర్ర‌మ‌ట్టి పిచ్‌పై మిచెల్ స్టార్క్(214), ఆండ్రూ ర‌స్సెల్(319)లు చేల‌రేగ‌డంతో టాప్ గ‌న్స్ అంతా డ‌గౌట్‌కు క్యూ క‌ట్టారు. 
 
అభిషేక్ శ‌ర్మ‌(2), ట్రావిస్ హెడ్(0)లు మ‌రోసారి నిరాశ‌ప‌ర‌చ‌గా.. ఎడెన్ మ‌ర్క్‌ర‌మ్(20), హెన్రిచ్ క్లాసెన్‌(16)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. చివ‌ర్లో కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్(24) ధ‌నాధ‌న్ ఆడి జ‌ట్టు స్కోర్ 100 దాటించాడు. ర‌స్సెల్ వేసిన 19వ ఓవ‌ర్లో క‌మిన్స్ ఔట్ కావ‌డంతో 113 ప‌రుగుల‌కే స‌న్‌రైజ‌ర్స్ ఆలౌట‌య్యింది.

తొలుత‌ ఆండ్రూ ర‌స్సెల్(3/19), మిచెల్ స్టార్క్(2/4) బంతితో బెంబేలెత్తించారు. దాంతో ఐపీఎల్ ఫైన‌ల్లోనే అత్య‌ల్ప స్కోర్‌కు హైద‌రాబాద్ ఆలౌట‌య్యింది. అనంతరం ఓపెన‌ర్ ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్(39), వెంక‌టేశ్ అయ్య‌ర్(52 నాటౌట్)లు సుడిగాలి ఇన్నింగ్స్ ఆడారు. దాంతో, ఐపీఎల్ ఫైన‌ల్ చ‌రిత్ర‌లోనే లో స్కోరింగ్ న‌మోదైన మ్యాచ్‌లో కోల్‌క‌తా జ‌య‌భేరి మోగించింది. గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014లో టైటిల్ గెలిచిన కోల్‌క‌తా ఇప్పుడు అత‌డు మెంటార్‌గా రాగానే చాంపియ‌న్‌గా నిల‌వ‌డం విశేషం.

ఐపీఎల్- 2024 మొత్తం అదరగొట్టిన కోల్‌కతా బౌలర్లు ఫైనల్లో అంతకుమించి చెలరేగడం విశేషం. ఏ దశలోనూ సన్‌రైజర్స్‌ను కోలుకోనివ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ రైజర్స్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది.  తొలి ఓవర్లోనే అభిషేక్ (2) వికెట్ తీసి శుభారంభం అందించాడు మిచెల్ స్టార్క్. మరుసటి ఓవర్లో ట్రావిస్ హెడ్‌ను (0) అద్భుత బంతితో పెవిలియన్ చేర్చాడు వైభవ్ అరోరా. క్వాలిఫయర్-1, 2 హీరో రాహుల్ త్రిపాఠి భారీ షాట్‌కు (9) ప్రయత్నించి స్టార్క్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

ప‌దిహేడో సీజ‌న్‌లో ఎన్నో ఉత్కంఠ పోరాటాలు.. ఆఖ‌రి ఓవ‌ర్ థ్రిల్ల‌ర్ చూశాం. దాంతో, ఫైన‌ల్ మ్యాచ్ అన‌గానే ప‌వ‌ర్ హిట్ట‌ర్ల విధ్వంసం ఆఖ‌రి ఓవ‌ర్ ఉత్కంఠ.. రికార్డు ఛేజింగ్ ఉంటాయ‌నుకున్న అభిమానుల‌కు నిరాశే మిగిలింది. చెపాక్ స్టేడియంలో కోల్‌క‌తా బౌల‌ర్లు రికార్డు బ్రేక‌ర్ స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టును ఓ ఆట ఆడుకున్నారు. దాంతో, హైద‌రాబాద్ 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

ఈ ఐపీఎల్‌లో కోల్‌కతా ప్రధాన బలం వారి బౌలింగ్. బ్యాటింగ్‌లో అన్ని టీమ్స్ రాణించినా పేస్, స్పిన్ రెండింట్లోనూ ఆరంభం నుంచీ కేకేఆర్ సమతూకంగా కనిపించింది. అదే బలంతో టైటిల్ గెల్చింది. ఈ ఐపీఎల్‌లో మిడిల్ ఓవర్లలో (7-15) అత్యధిక వికెట్లు తీసిన వారిలో తొలి 3 స్థానాల్లో కోల్‌కతా బౌలర్లే ఉండటం విశేషం. 

వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలోనే 17, సునీల్ నరైన్ (13), ఆండ్రీ రసెల్ (12) వికెట్లు తీశారు. సీజన్ మొత్తంలో కోల్‌కతా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. చక్రవర్తి 14 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా (19), రసెల్ (19), నరైన్ (17), స్టార్క్ (17) వికెట్లు తీశారు. సన్‌రైజర్స్ నుంచి నటరాజన్ (19), కమిన్స్ (18) తప్ప ఎవరూ ఆకట్టుకోలేదు.