అణ్వాయుధ సామ‌ర్థ్యం క‌లిగిన అగ్ని ప్రైమ్ క్షిపణి ప‌రీక్ష

అగ్ని ప్రైమ్ క్షిప‌ణిని ఇవాళ విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు. ఒడిశాలోని బాలాసోర్ వ‌ద్ద ఈ మిస్సైల్‌ను ప‌రీక్షించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అగ్ని-పీ మిస్సైల్ కొత్త జ‌న‌రేష‌న్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ వేరియంట్. అగ్ని ప్రైమ్ క్యానిస్ట‌ర్ మిస్సైల్‌. దీని సామ‌ర్థ్యం 1000 నుంచి 2000 కిలోమీట‌ర్ల దూరం. 

అగ్ని ప్రైమ్‌కు అణ్వాయుధాలు మోసుకువెళ్లే సామ‌ర్థ్యం ఉన్న‌ది. అగ్ని క్లాస్‌కు చెందిన ఈ మిస్సైల్‌లో అనేక కొత్త ఫీచ‌ర్ల‌ను జోడించారు. అత్యంత కచ్చితత్వంతో మిష‌న్ ల‌క్ష్యాల‌ను చేరుకున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఇవాళ ఉద‌యం 11.06 నిమిషాల‌కు డీఆర్డీవో ఈ ప‌రీక్ష చేప‌ట్టింది. అగ్రి ప్రైమ్ క్షిప‌ణి ప‌రీక్ష స‌మ‌యంలో.. టెలిమెట్రీ, రేడార్‌, ఎల‌క్ట్రో ఆప్టిక‌ల్ స్టేష‌న్స్‌, డౌన్‌రేంజ్ షిప్స్‌ను తూర్ప తీరం వ‌ద్ద ట్రాక్ చేశారు. అనుకున్న‌ట్లే క్షిప‌ణి ట్రాజెక్ట‌రీ సాగింద‌ని డీఆర్డీవో చెప్పింది. 

హై లెవ‌ల్ అక్యురెసితో అన్ని అబ్జెక్టివ్‌లను అందుకున్న‌ట్లు డీఆర్డీవో వెల్ల‌డించింది. అగ్ని ప్రైమ్ క్షిప‌ణి.. రెండ ద‌శ‌ల సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ మిస్సైల్‌. డ్యుయ‌ల్ నావిగేష‌న్‌, గైడెన్స్ వ్య‌వ‌స్థ‌లు కూడా ఉన్నాయి. మిస్సైల్‌లో ఉన్న అన్ని అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీలు సెకండ్ ఫ్ల‌యిట్ టెస్ట్‌లో స‌రైన రీతిలో స్పందించిన‌ట్లు డీఆర్డీవో చెప్పింది.

విజ‌య‌వ‌తంగా అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను ప‌రీక్షించినందుకు ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కంగ్రాట్స్ చెప్పారు. క్షిప‌ణి అద్భుత‌మైన రీతిలో ప‌నిచేసినందుకు ఆయ‌న అత్యంత సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. మిస్సైల్ ప‌రీక్షలో పాల్గొన్న బృందానికి డీఆర్డీవో చైర్మెన్ డాక్ట‌ర్ జీ స‌తీశ్ రెడ్డి ప్ర‌శంస‌లు తెలిపారు.