దేశంలో 153కు చేరిన ఒమిక్రాన్‌ కేసులు

 దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా గుజరాత్‌లో ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు నిర్థారణైంది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 153కు చేరింది.  మహమ్మారి సరికొత్త రూపం వేగంగా విస్తరిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఆదివారం మహారాష్ట్రలో ఆరు, గుజరాత్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 153కు చేరింది.

అధికారిక గణాంకాల ప్రకారం 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 54, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, తెలంగాణ 20, గుజరాత్‌ 11, కేరళ 11, ఆంధ్రప్రదేశ్‌ 1, చండీగఢ్‌ 1, తమిళనాడు 1, పశ్చిమబెంగాల్‌లో 1 చొప్పున రికార్డయ్యాయి.

ఆదివారం బ్రిటన్‌ నుండి గుజరాత్‌కు వచ్చిన ఒక వ్యక్తితో పాటు బాలుడిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ ఇద్దరిని అహ్మదాబాద్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. 

అత్యధికంగా మహారాష్ట్రలో 54కేసులు నమోదయ్యాయని, వారిలో 28 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ 20, రాజస్తాన్‌ 17, కర్ణాటక 14, కేరళ 11, గుజరాత్‌ 9, ఆంధ్రప్రదేశ్‌, చంఢగీఢ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 

ఈ కొత్త వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్‌ ఎంతో స్పీడ్‌గా వ్యాప్తి చెందుతున్నదని తెలిపింది. ఇప్పటికే 90కిపైగా దేశాల్లో ఈ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది.

 ఒమిక్రాన్‌ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలు పాటించాలని పేరొన్నది. వీలైంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవలని సూచించింది.

కాగా, ఒమిక్రాన్ వేరియంట్ గ‌త నెల 24న ఆఫ్రికా ద‌క్షిణ దేశాల్లో బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌ర్వాత క్ర‌మంగా ఇత‌ర దేశాల‌కు విస్త‌రించింది. మ‌న దేశంలో డిసెంబ‌ర్ 2న ఒమిక్రాన్ కాలు మోపింది. ఆ రోజు బెంగ‌ళూరులో ఇద్ద‌రు వ్య‌క్తుల్లో ఒమిక్రాన్ వేరియంట్ బ‌య‌ట‌ప‌డింది.