చిన్న ఉపగ్రహాల అభివృద్ధికి ఇస్రోకు రూ 169 కోట్లు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రైవేట్ భాగస్వామ్యంతో స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ను అభివృద్ధి చేస్తున్నది. ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో చిన్న ఉపగ్రహాలను ద్వారా నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
ఈ క్రమంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టు అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.169కోట్లు మంజూరు చేసింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానం కేంద్ర మంత్రి జిత్రేందర్‌ సింగ్‌ సమాధానం ఇచ్చారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రాజెక్ట్‌ అభివృద్ధి చివరి దశలో ఉందని, వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో తొలి ప్రయోగం నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
 
మంజూరు చేసిన నిధులు ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టు అభివృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. 2016 ఏప్రిల్‌ నుంచి గత ఐదేళ్లలో 27 శాటిలైట్‌ మిషన్లు, 25 లాంచ్‌ వెహికిల్‌ మిషన్లు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పారు. 
 
అదనంగా, దేశీయ, విదేశాలకు చెందిన 286 వాణిజ్య ఉపగ్రహాలను, భారతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన ఎనిమిది ఉపగ్రహాలను ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ప్రధాన ప్రయోగాల్లో భారీ ఉపగ్రహం జీఎస్‌ఎల్‌వీ మాక్‌-3, చంద్రయాన్‌-2ను కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. 
 
అలాగే అడ్వాన్స్ కార్టోగ్రఫీ శాటిలైట్, కార్టోశాట్-3, జీశాట్‌-11, ఒకే రాకెట్‌ ద్వారా 104 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.