కర్ణాటకలో ఐదుగురికి, తెలంగాణలో నలుగురికి ఒమిక్రాన్‌

తెలంగాణలో మరో నలుగురికి ఒమిక్రాన్‌ సోకింది. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు పెరిగింది. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురికి, భారత్‌కు చెందిన మరో వ్యక్తిలో వేరియంట్‌ను గుర్తించారు. 

రిస్ట్‌ దేశాల నుంచి వచ్చిన ఒకరికి, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. మరో ముగ్గురు విదేశీ ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. అధికారులు నమూనాలను సేకరించి.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం సీసీఎంబీకి పంపారు.

దేశంలో గురువారం నాటికి ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య 83కు చేరుకుంది. గురువారం కర్నాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఢిల్లీల్లో ఈ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. 

అలాగే కర్ణాటకలోనూ ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. కొత్త కేసులతో మొత్తం సంఖ్య ఎనిమిది పెరిగింది. ఇదిలా ఉండగా..  ఢిల్లీలో మరో నలుగురికి, గుజరాత్‌లో ఒకరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 87కు పెరిగాయి. 

ఇప్పటి వరకు కర్ణాకటలో 8, తెలంగాణలో 7, ఢిల్లీలో 10, మహారాష్ట్ర 32, రాజస్థాన్‌ 17, కేరళ 5 , గుజరాత్‌ 5, ఏపీ, తమిళనాడు, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది.

దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ భ‌ల్లా గురువారం ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఒమిక్రాన్ కేసుల తీవ్ర‌త‌, త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు కేంద్ర హోంశాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

కేసుల తీవ్ర‌త దృష్ట్యా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న విష‌యంపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు పేర్కొంది. కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ భ‌ల్లా ఆధ్వ‌ర్యంలో ఓ స‌మావేశం జ‌రిగింది. ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి కూడా ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. 

కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ ప‌రిస్థితిపై చ‌ర్చించారు. కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో స‌మాయ‌త్తంపై కూడా చ‌ర్చించారు. అని కేంద్ర హోంశాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.