చీఫ్ అఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ గా జనరల్ నరవాణే 

భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం,  ప్రస్తుతానికి పాత విధానమే అమలు చేస్తున్నారు. వెంటనే మరొకరిని సిడిఎస్ గా నియమించకుండా,  ముగ్గురు సర్వీస్ చీఫ్‌లలో అత్యంత సీనియర్లు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి  త్రివిధ దళాల మధ్య సమన్వయంకోసం చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు.

భారతీయ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే  అత్యంత సీనియర్ కావడంతో సిడిఎస్ వ్యవస్థ  ఉనికిలోకి రాకముందు ఉన్న పద్ధతి ప్రకారం చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కొత్త సిడిఎస్‌ను నియమించే వరకు ఈ ఏర్పాటు కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

డిసెంబరు 8న తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు, ఆయన  భార్య మధులికా రావత్, ఆయన డిఫెన్స్ అసిస్టెంట్ బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడర్, స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్జీందర్ సింగ్,   మరో పది మంది మరణించిన తర్వాత ఈ ఏర్పాటు అవసరం అయింది.

సిడిఎస్ కు రిపోర్టు చేసే చీఫ్ ఆఫ్ ఇంటెగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ టు ఛైర్మెన్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ   సీనియారిటీ ప్రకారం చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి సారథ్యం వహిస్తున్నందున, ప్రస్తుతానికి జనరల్ నరవానేకి రిపోర్ట్ చేస్తారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి శాశ్వత ఛైర్మన్‌గా వ్యవహరించడమే కాకుండా కొత్తగా సృష్టించిన   మిలిటరీ వ్యవహారాల విభాగానికి కూడా నాయకత్వం వహిస్తారు.

మిలిటరీ వ్యవహారాల శాఖలో రెండవ అత్యంత సీనియర్ అధికారి అదనపు కార్యదర్శి, త్రీ స్టార్ మిలటరీ అధికారి. ప్రస్తుతం ఈ పదవిని లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి నిర్వహిస్తున్నారు. సైనిక వ్యవహారాల శాఖ ఉమ్మడి ప్రణాళిక, వారి అవసరాలను ఏకీకృతం చేయడం ద్వారా సేవల సేకరణ, శిక్షణ, సిబ్బందిలో ఉమ్మడిగా పనిచేయడాన్ని   ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

జాయింట్, థియేటర్ కమాండ్‌ల స్థాపనతో సహా కార్యకలాపాలలో జాయింట్‌నెస్‌ని తీసుకురావడం ద్వారా వనరుల సరైన వినియోగం కోసం సైనిక కమాండ్‌ల పునర్నిర్మాణాన్ని సులభతరం చేయడం,  సేవల ద్వారా స్వదేశీ పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించడం కూడా లక్ష్యాలుగా పేర్కొన్నారు.

చీఫ్‌లు తమ తమ బలగాల కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తుండగా, సిడిఎస్ కు  ట్రై-సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ సమస్యలపై అధికారాలు ఉంటాయి. అదనంగా, ఉమ్మడి నిర్వహణలో ముఖ్యమైన భాగమైన ట్రై-సర్వీస్ శిక్షణ సిడిఎస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ క్రింద ఉంది.

2019లో సిడిఎస్ నియామకం సమయంలో, ప్రభుత్వం  విడుదల చేసిన ప్రకటనలో  “అతను అన్ని త్రిదళ  వ్యవహారాలపై రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తారు. ముగ్గురు చీఫ్‌లు తమ తమ సేవలకు సంబంధించిన విషయాలపై ప్రత్యేకంగా రక్షణ మంత్రికి సలహా ఇస్తూనే ఉంటారు. సిడిఎస్ రాజకీయ నాయకత్వానికి నిష్పాక్షికమైన సలహాలను అందించడానికి వీలుగా, ముగ్గురు సర్వీస్ చీఫ్‌లతో సహా ఎటువంటి సైనిక ఆదేశాలను అమలు చేయదు.