త‌బ్లిగీ జ‌మాత్‌ తో సంబంధాలు నిషేధించిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా ఇస్లామిక్ దేశాలు ఆశ్చ‌ర్య పోయే రీతిలో త‌బ్లిగీ జ‌మాత్, దావా  సంస్థ‌లకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రార్ధనల సమయంలో ప్రజలను హెచ్చరించాలని మసీదులను ఆదేశించింది. ఈ సంస్థలతో ప్రజలు ఎవ్వరు సంబంధాలు పెట్టుకోరాదని స్పష్టం చేస్తూ,   ఈ సంస్థ ఉగ్ర‌వాదానికి పునాదులేస్తున్న‌ద‌ని అభివ‌ర్ణించింది. 
 
అంతే కాదు వ‌చ్చే శుక్ర‌వారం ప్రార్థ‌న‌లు ప్రారంభ‌మ‌య్యే లోపు త‌బ్లిగీ స‌భ్యులు మ‌సీదులను ఖాళీ చేయాల‌ని సౌదీ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది. “ఉగ్రవాదంపై గేట్  లలో ఇదొక్కటి” అని పేర్కొంటూ ఇక నుంచి శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల వేళ త‌బ్లిగీ జ‌మాత్ స‌భ్యుల‌ను ప్ర‌జ‌లు క‌లుసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని సౌదీ స‌ర్కార్ త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. సౌదీ ప్రభుత్వ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మసీదులకు ఆ మేరకు దిశానిర్దేశం చేసింది.
సౌదీ ప్రభుత్వంలోని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి అబ్దుల్లతీఫ్ అల్ అల్షేక్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో తబ్లిఘి జమాత్‌ను “ఉగ్రవాదం  గేట్‌లలో ఒకటి” అని,  ఇది “సమాజానికి తీవ్రమైన ముప్పు” అని పేర్కొంటూ అధికారిక ప్రకటన చేశారు. ఈ నిషేధిత సంస్థతో ప్రజలు ఎవ్వరు సంబంధాలు పెట్టుకోవద్దని ఆదేశించాలని మసీదులకు ప్రభుత్వం సూచించింది. 

తబ్లిఘి జమాత్ వంటి సమూహాలు ముస్లింలు సున్నీ ఇస్లాం  స్వచ్ఛమైన రూపంలోకి తిరిగి రావాలని బోధించగా, దావా గ్రూపులు ముస్లింలు,  ముస్లిమేతరులతో సహా అందరినీ  ఖురాన్‌లో అల్లా (దేవుని) ఆరాధన ఎలా ఉందో వెల్లదించడానికి ఆహ్వానిస్తుంది.
సౌదీ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అటువంటి తబ్లిఘి గ్రూపులు తప్పుదోవ పట్టించడాన్ని తప్పనిసరిగా మసీదులు ప్రజలకు తెలియచెప్పాలని స్పష్టం చేసింది.

వారితో ఎటువంటి సంబంధ బాంధ‌వ్యాలు నెల‌కొల్పుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని సౌదీ ప్రభుత్వం వెల్లడించినది. ఈ సంస్థ‌తో స‌మాజానికి ముప్పు పొంచి ఉన్న‌ద‌న్న‌దని హెచ్చరించింది. దేశంలో ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషించే సామ‌ర్థ్యం దీనికి ఉన్న‌ద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 

త‌బ్లిగీ జ‌మాత్ గురించి మ‌సీదుల వేదిక‌గా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపింది. ఆ సంస్థ కార్య‌క‌లాపాల‌ను ప్ర‌జ‌ల దృష్టికి తేవాల‌ని భావిస్తున్నామ‌ని పేర్కొన్న‌ది. ఇస్లాంను శుద్ధి చేయడం కోసం అంటూ సుమారు వంద సంవత్సరాల క్రితం భారత్ లో ప్రారంభించిన ఈ సంస్థకు ప్రధానంగా నిధులను సమకూరుస్తుంది సౌదీ ప్రభుత్వం కావడం గమనార్హం.

ఇప్పుడు ఆ ప్రభుత్వమే నిషేధించడంతో ఈ సంస్థ మనుగడ ప్రశ్నార్ధకరంగా మారే అవకాశం ఉంది. పలు దేశాలలో పనిచేస్తున్న ఈ సంస్థలో వివిధ దేశాలలో 40 కోట్ల మంది వరకు సభ్యులు ఉన్నారని చెబుతూ ఉంటారు. ఇండోనేసియా, మలేసియా, పాకిస్థాన్, థాయిలాండ్, బాంగ్లాదేశ్ లలో ఈ సంస్థ బలోపేతంగా ఉంది.

తమది కేవలం మతపరమైన సంస్థే గాని, రాజకీయాలతో సంబంధం లేదని చెబుతూ ఉన్నప్పటికీ ఆయా దేశాలలో రాజకీయ నాయకులను నియంత్రించే ప్రయత్నం చేస్తుంటారు. సౌదీ అరేబియా బాట‌లో ఇత‌ర ఇస్లామిక్ దేశాలు ప‌య‌నించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

గత ఏడాది కరోనా సమయంలో ఈ సంస్థ ఢిల్లీలో ఎటువంటి నిబంధనలు పాటింప కుండా,  అనుమతి లేకుండా జరిపిన అంతర్జాతీయ సదస్సు కారణంగానే భారత దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపించినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఈ సదస్సుకు వచ్చిన ప్రతినిధులు దేశంలో వివిధ ప్రాంతాలలోనే మసీదులకు వెళ్లి ఈ మహమ్మారిని దేశ వ్యాప్తంగా వ్యాపింప చేశారనే ఆరోపణలు వచ్చాయి.