పాఠశాలల మూసివేతతో 32 కోట్ల చిన్నారులపై ప్రభావం 

కరోనా వేళ స్కూళ్ల మూసివేత విద్యార్థుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. స్కూళ్లు మూసివేయ‌డం వ‌ల్ల‌ దేశ‌వ్యాప్తంగా సుమారు 32 కోట్ల మంది చిన్నారులపై ప్ర‌భావం చూపిన‌ట్లు కేంద్ర విద్యాశాఖ వెల్ల‌డించింది. మ‌హిళ‌ల సాధికార‌త పార్ల‌మెంట‌రీ క‌మిటీకి విద్యాశాఖ ఈ విష‌యాన్ని చెప్పింది.
 
బేటీ బ‌చావో.. బేటీ ప‌డావోపై నివేదిక‌ను పార్ల‌మెంట్‌కు అంద‌జేసింది. దాంట్లో స్కూళ్ల మూసివేత వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా 32 కోట్ల మంది చిన్నారుల‌పై ప్ర‌భావం ప‌డిన‌ట్లు చెప్పింది. వారిలో 15.8 కోట్ల మంది అంటే.. సుమారు 49.37 శాతం మంది అమ్మాయిలు ఉన్న‌ట్లు విద్యాశాఖ వెల్ల‌డించింది. 
 
మ‌హ‌మ్మారి స‌మ‌యంలో కౌమార ద‌శ‌లో ఉన్న బాలిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డిన‌ట్లు అధికారులు చెప్పారు. మ‌హ‌మ్మారి ముగిసిన త‌ర్వాత బాలిక‌లు ఎక్కువ స్థాయిలో చ‌దువుల‌కు దూరం అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేశారు. 
 
ఒకే ఒక్క స్మార్ట్‌ఫోన్ ఉన్న ఇండ్ల‌ల్లో.. బాలిక‌ల‌కు ఆన్‌లైన్ విద్య దూరం అవుతున్న‌ట్లు విద్యాశాఖ త‌న నివేదిక‌లో చెప్పింది. స్కూల్‌కు రాని విద్యార్థుల సంఖ్య క్ర‌మంగా పెరిగిన‌ట్లు కూడా విద్యాశాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 2020-2021లో ప‌ది ల‌క్ష‌ల మంది చిన్నారులు స్కూల్‌కు డుమ్మా కొడితే.. ఇక ఈ ఏడాది ఆ సంఖ్య 27.85 ల‌క్ష‌ల‌కు చేరిన‌ట్లు విద్యాశాఖ వెల్ల‌డించింది.
మరోవంక,  ప్రపంచ మహమ్మారితో ప్రస్తుత తరం విద్యార్థులు తమ జీవన సంపాదనలో 17 ట్రిలియన్ల అమెరికా డాలర్ల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇది మొత్తం ప్రపంచ జీడీపీలో 14శాతం. ఇందుకు సంబంధించిన డేటాను ప్రపంచ బ్యాంకు, యూనెస్కో నివేదికను ప్రచురించాయి.

ఇందులో కరోనా మహమ్మారి సమయంలో పాఠశాలలను మూసివేయడం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. ఈ నివేదికకు ‘స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ ఎడ్యుకేషన్ క్రైసిస్.. ఏ పాత్ టు రికవరీ రిపోర్ట్’ అని పేరు పెట్టారు. పాఠశాలలపై కరోనా ప్రభావం ఊహించినదాని కంటే భారీగానే ఉందని నిపుణులు పేర్కొన్నారు.

పది ట్రిలియన్ల అమెరిక్‌ డాలర్ల కంటే చాలా ఎక్కువ. మధ్య, తక్కువ ఆదాయ దేశాల్లో 53శాతం మంది విద్య కోసం పోరాడుతున్నారని నివేదిక పేర్కొంది. ఇప్పుడు కొవిడ్‌ మహమ్మారి కారణంగా బడులు మూతడిన తర్వాత ఇది 70 శాతానికి పెరుగనున్నది.

కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ప్రభుత్వాలు ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో మూడు శాతం కంటే తక్కువ విద్య కోసం కేటాయించారు. అయితే, ప్రస్తుత సమయంలో దీని కంటే ఎక్కువ అవసరమని నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు విద్యార్థులు తమ స్థాయికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని, దీంతో పాటు ఉపాధ్యాయులు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నివేదిక పేర్కొంది.

అమెరికా, బ్రిటన్ లలోని  పరిశోధకుల తాజా అధ్యయనాలు సహితం  ప్రపంచవ్యాప్తంగా  విద్యా పురోగతి, బాలల ఆరోగ్యం, సంక్షేమంలకు పాఠశాల మూసివేత వల్ల కలిగే నష్టాన్ని స్పష్టం చేస్తున్నాయి.

విద్య అనేది ఆరోగ్యాన్ని నిర్ణయించే బలమైన అంశాలలో ఒకటి.   దానికి అంతరాయం కలిగించడం వలన ఆరోగ్యం, సంక్షేమం   వివిధ మార్గాల్లో ప్రభావితం చేయవచ్చని చెబుతున్నారు. విద్య కోల్పోవడం వల్ల ఆరోగ్యం, జీవితకాలం ప్రతికూలంగా ప్రభావితమవుతుందని వారు అంటున్నారు.

పైగా ఇదే సమయంలో, సోషల్ సపోర్ట్ నెట్‌వర్క్‌లు ఉల్లంఘనెలకు గురవుతున్నాయి. పాఠశాలల ద్వారా నిర్వహించే పాఠశాల ఆరోగ్య సంరక్షణ, సామాజిక రక్షణ విధానాలను బాలలు కోల్పోతున్నారు.   శారీరక శ్రమ తగ్గుతుంది. సమాజంలోని అణగారిన వర్గాలలో  పాఠశాల భోజనం కోల్పోవడం  కారణంగా మొత్తం పోషణలో తీవ్రమైన లోటును కలిగిస్తుంది.


ఇక ఆసుపత్రులలో  అత్యవసర విభాగంలలో అన్ని దేశాలలో 64% నుండి 89% వరకు బాలలు చేరడం తగ్గిన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‌లు, గాయాలు,  కాలిన గాయాలు వంటి రుగ్మతలతో ఆసుపత్రులలో చేరడం తగ్గడమే అందుకు కారణం. 
అభివృద్ధి చెందిన ప్రపంచంలోని చాలా దేశాల్లో అధ్యయనం ప్రకారం మొత్తం ఆసుపత్రిలలో చేరడం 31% నుండి 86% వరకు తగ్గింది.