నేడే బాబు గెను సైద్ బలిదానం రోజు…. స్వదేశీ దివస్

డా. ఎస్ లింగమూర్తి, 

అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ కర్ణాటక 

* స్వదేశీ కోసం మొదటి బలిదానం జరిగిన రోజు 

* స్వదేశీ దివస్ గా స్వదేశీ జాగరణ్ మంచ్ పిలుపు 

డిసెంబర్12, 1930 భారత దేశ స్వదేశీ ఉద్యమంలో అత్యంత ముఖ్యమైన రోజు. విదేశీ వస్త్ర ఉత్పత్తులను దేశంలో జొప్పించడం ద్వారా మన వస్త్ర పరిశ్రమను నాశనం చేయాలనీ బ్రిటిష్ పాలకులు చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా పోరాడి, 22 ఏళ్ళ వయస్సులోనే ముంబై కాటన్ పరిశ్రమలో ఓ కార్మికుడు బాబు గెను సైద్ బలిదానం చేసిన రోజు. 

డిసెంబర్ 12, మన దేశ ఆర్థిక స్వాతంత్య్రాన్ని పరిరక్షించడం కోసం నేలపై స్థిరంగా నిలబడి తన ప్రాణాలను అర్పించిన నిరక్షరాస్యుడైన కాటన్ మిల్లు కార్మికుడు – మొదటి స్వదేశీ అమరవీరుడు.  దివంగత బాబు గెను సైద్   సంస్మరణ దినాన్ని మనం జరుపుకుంటున్నాము.

బాబు గెను సైద్ మహారాష్ట్రలోని మహలుంగే పడ్వాల్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. రెండేళ్ళ వయసులో తండ్రిని కోల్పోయిన అతని తల్లి ఉపాధి వెతుక్కుంటూ బొంబాయి వెళ్ళింది. జెనూ తరువాత తన తల్లి వద్ద చేరాడు.

ముంబైలోని ప్రఖ్యాత పత్తి మిల్లులలో సాధారణ కార్మికుడిగా నిమగ్నమై ఉన్నాడు. అతను మహాత్మా గాంధీ ప్రతిపాదించిన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ప్రభావితుడయ్యాడు. బ్రిటిష్ వారి విదేశీ దిగుమతులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో చురుకుగా పాల్గొన్నాడు. ఈ దిగుమతులు మన దేశ ఆర్థిక కార్యకలాపాలకు విరుద్ధమని అర్థం చేసుకుని విదేశీ తయారీ వస్త్రాల దిగుమతికి వ్యతిరేకంగా నిరసన తెలిపాడు.

జార్జ్ ఫ్రేజియర్, ఒక బట్టల వ్యాపారి.  దిగుమతిదారుడు.  ఆ విధిలేని రోజున – డిసెంబర్, 12, 1930న పోలీసు రక్షణతో ట్రక్కులో విదేశీ వస్త్రాన్ని తరలిస్తున్నాడు. స్వాతంత్య్ర సమరయోధులు నిర్మాణ తెలుపుతూ ఉద్యమించారు. అయినా  ట్రక్కు ముందుకు వెళ్లేందుకు పోలీసులు మార్గాన్ని సుగమం చేశారు.

అయితే కల్బాదేవి రోడ్డులోని భాంగ్‌వాడి వద్ద ట్రక్కు ముందు బాబు గేను నిలబడ్డాడు. మహాత్మా గాంధీని స్తుతిస్తూ, మొండిగా దూరంగా వెళ్లడానికి నిరాకరిస్తూ ర్యాలీ కేకలు వేయడంతో బ్రిటిష్ పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను నిరసనకారులను పట్టించుకోకుండా ముందుకు నడవమని ఆదేశించేలా చేసింది.

వారిని చూస్తున్న బ్రటిష్ పోలీస్ అధికారి అసహనానికి లోనై తన కోపాన్ని ప్రదర్శిస్తూ డ్రైవర్ ను ఇతనిపై ట్రక్ ఎక్కించు అని గట్టిగా అరిచాడు. ట్రక్ డ్రైవర్ దేశ భక్తి కలిగిన వ్యక్తి బల్బీర్ సింగ్.  ఆ అధికారి తో డ్రైవర్ “నేను భారతియుడ్ని, ఇతను భారతీయుడు.  మేమిద్దరం సోదరులం.  నాసోదారుణ్ణి నేను ఎలా చంపుతాను?” అంటూ ట్రక్ దిగి వెళ్ళిపోయాడు.

దానితో కోపం రెట్టింపైన ఆ పోలీసు అధికారి డ్రైవర్ సీటులో కూర్చుని ట్రక్కు ను బాబు గేను పైనుండి తొక్కుకుంటూ తీసుకెళ్తాడు.  బాబు గేను ఘోరమైన వీరమరణం చెందాడు.  మిగతా నిరసన కారులను పోలీస్ లు చితక బాధి ట్రక్కు ను తీసుకెళ్ళారు.

బాబు గెను హత్య ముంబై అంతటా హింసాత్మక నిరసనలను రేకెత్తించింది. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ వెంటనే ఈ భయంకరమైన చర్యను “ప్రమాదం”గా వర్ణిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఒక అమరవీరుడు-స్వదేశీ కోసం అమరుడైన మొదటివాడు.

ప్రపంచ వాణిజ్యంలో ఆర్థిక ప్రభావాన్ని ఆకళింపు చేసుకున్న ఆర్థికవేత్త బాబు జెను అని ఎవరూ చెప్పలేరు. కేవలం విదేశీ వస్త్రాల దిగుమతి కారణంగా  చాలా మంది ఉపాధి ప్రమాదంలో పడుతుందని మాత్రమే అతనికి తెలుసు. తన దేశం  ఆర్థిక స్వాతంత్య్రం రాజీ పడవలసి వస్తుందని గ్రహించాడు.

ఈ యువకుడు ఏ లక్ష్యం కోసం ప్రాణాలర్పించాడో మనం గ్రహించి, ఆ లక్ష్యం కోసం  ఏకతాటిపైకి వచ్చి, పని చేయకూడదా? మన దేశం  నుండి ఉత్పత్తులు,   సేవలను బయటకు తీసుకువచ్చే మన  సోదరులకు మద్దతు ఇవ్వడం ద్వారా మనం మన ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా సహాయం చేయకూడదా?

బాబు గేను అంతగా చదువుకోలేదు. అయినప్పటికీ దేశ రాజకీయ, భౌగోలిక, ఆర్ధిక విషయాల పట్ల అవగాహన పెంచుకున్నాడు. భారత దేశంలోని బ్రిటిష్  పాలన  ఆర్థికంగా నిలకడ లేనిదిగా ఉంటే భారతదేశంలో బ్రటిష్ పాలన కొనసాగించడం సాధ్యపడదు.  అది కూలి పోతుందని గ్రహించాడు.  భారతదేశపు ఆర్థిక స్వతంత్రం, రాజకీయ స్వతంత్రం ఒకదానితో ఒకటి ముడిపడి ఏకికృతమై ఉందని అతనికి తెలుసు.

అయితే మన రాజకీయ నాయకులు ఇటువంటి వాస్తవ అంశాలపై చర్చ నుండి తప్పించుకొనేవారు. దేశ ఆర్థిక స్వేచ్చ కోణం నుండి చూసినా మూలం ఆర్థిక స్వాతంత్య్రం అని, దేశ రాజకీయ స్వాతంత్య్రంకు అదే మూలం అని తాను విశ్వసించి దానికోసం తన జీవితాన్ని త్యాగానికి కూడా వెనుకాడలేదు అనటంలో ఆశ్చర్యం లేదు.

బాబు గేను ఆర్థిక ఆలోచన దశబ్దాల తర్వాత కూడా దేశం అభివృద్ధి కి సరిపోయే ఆర్థిక నమూనా  దాన్ని ఎంత మాత్రం కొట్టి పారేయటానికి వీలులేదు.ఆర్థికంగా, భౌతికంగా తమ విశ్వాసాలను నిలబెట్టడం కోసం తమ ప్రాణాలను అర్పించిన ఈ మహానుభావుల జీవితంలో ఉన్న సందేశాన్ని ఎవ్వరూ  కొట్టి పారేయకూడదు. ఎందుకని?

మొదటిది :ఈ మహానుభావుల గొప్ప ఆలోచనలు అత్యున్నత నిస్వార్థ త్యాగం

రెండవది : చాలా ముఖ్యమైనది బాబు గేను జీవితం,

భారతదేశంలో ప్రస్తుతం ఉన్న స్థితి కంటే భిన్నంగా ఉండవచ్చు  ప్రపంచ శక్తులు తమ ఏజండాను కలిగి ఉన్నాయి.  ఇతరులపై వారి ఆలోచనలు, నమ్మకాలను విధించటంలో వారి సంకల్పం ఖచ్చితంగా ఉంది.  ఆ దిశగా క్రీస్తు తర్వాత మొదటి సహస్రబ్ది లో మతం ద్వారా రాజకీయ ఆధిపత్యం ఉంటే, రెండవ సహస్రబ్ది లో సైన్యం ద్వారా జరిగింది.   భయంకర విషయం ఏమిటంటే బహుశా మూడవ దానిలో ఆర్థిక జోక్యం ఉంటుంది.

ప్రపంచం ఇతరులను ఎలా చూస్తుంది? ఎలా లొంగదిసుకోవాలో?  లొంగదిసుకోవాల్సిన విదంగా ఇతరులను నిమగ్నం చేయాలనే భయంకరమైన ఆలోచనలతో ఉంది. ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నాము? ఇతరులు ప్రపంచాన్ని ఎలాచూస్తున్నారు?

కాదు, మనం సమాజంలో ఒకరిగా బాబు గేను వంటి వారి ఆలోచనలు అదర్షాలు మన ఆలోచనల నుండి మసక బారుతున్న తరుణంలో మీరు చరిత్రను మరిచిపొతే దానిని పునరావృతం చేయవలసిన సమయం ఆసన్నమైంది.  సహజంగానే ఈ ఆధునిక కాలంలో ప్రపంచ ఆర్థిక, భౌగోళిక, రాజకీయ ఉద్దేషాలు పూర్తిగా స్వతంత్రంగా ఉన్నాయా? లేక కుట్ర పూరితంగా ఉన్నాయా?అనేది మనం ఆలోచించాలి.

స్వదేశీ జాగరణ్ మంచ్ లక్ష్యం చిట్టచివరి వ్యక్తి సమృద్ధి, స్వాలంబన (అంత్యోదయ) కాబట్టి, బాబు గేను బలిదానంను స్వదేశీ దివస్ గా పాటించాలని నిర్ణయించింది.

స్వదేశీ….   స్వాభిమానం ….   స్వావలంబన….