కొత్తగా 9 ఒమిక్రాన్‌ కేసులు.. 32కు పెరిగిన సంఖ్య

శుక్రవారం నాడు కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది. మహారాష్ట్రలో ఒక్కరోజే 7 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గుజరాత్ లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. 

దేశవ్యాప్తంగా మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవగా.. ఒక్క మహారాష్ట్రలోనే 17 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మిగిలినవాటిలో రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒకటి నమోదయ్యాయి.

ఈ నెల 4న జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడితో పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. జింబాబ్వే నుంచి ఆ ఎన్‌ఆర్‌ఐ వ్యక్తితోపాటు వచ్చిన ఆయన భార్యకు, జామ్‌నగర్‌లోని బావకు ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ అయ్యింది. దీంతో గుజరాత్‌లో ఒమిక్రాన్‌ బారిన పడిన వారి సంఖ్య మూడుకు చేరింది.

మరోహైపు ముంబైలోని ధారవి ప్రాంతంలో ఒక ఒమిక్రాన్ కేసును గుర్తించారు. టాంజానియా నుండి తిరిగి వచ్చిన వ్యక్తి కొత్త వేరియంట్‌ బారినపడినట్లు శుక్రవారం నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను సెవెన్‌హిల్స్ హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసినట్లు బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. దీంతో మహారాష్ట్రలో ఒమిక్రాన్ బారినపడిన వారి సంఖ్య 11కు పెరిగింది.

ఇలా ఉండగా, పూణేలో  ‘ఒమిక్రాన్’ సోకిన వ్యక్తి తాజాగా కోలుకున్నట్లు పూణే మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సంజీవ్ వావరే వెల్లడించారు. ఒమిక్రాన్ సోకిన పేషెంట్‌కు ఇటీవల చేసిన కరోనా టెస్టుల్లో ‘నెగిటివ్’ రిజల్ట్ వచ్చిందని, అతన్ని శుక్రవారం నాడు డిశ్చార్జి చేయనున్నామని ఆయన తెలిపారు.

కాగా, దేశంలో ఒమిక్రాన్‌ కేసుల మొత్తం సంఖ్య 26కు చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 11, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో ౩, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒకటి చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా భారత్‌తో సహా 57 దేశాలు ఈ కొత్త కరోనా వేరియంట్‌ బారినపడ్డాయి.

ఒమిక్రాన్ దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ప్ర‌తి రైల్వే కార్మికుడికి వ్యాక్సిన్ తప్పనిసరి చేసింది. మాస్క్ లేకపోతే ఎవరికీ రైల్వే స్టేషన్, రైళ్లలో ప్రవేశం లేదు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్ లేకుండా రైల్వే స్టేషన్‌లోకి వస్తే..500 రూపాయలు జరిమానా విధించనున్నారు.