
హెలికాప్టర్ దుర్ఘటనలో దుర్మరణం పాలైన సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, ఇతర ఆర్మీ సిబ్బంది భౌతికకాయాలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రముఖులు, దేశ ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. గత రాత్రి వారి భౌతిక కాయలను తమిళనాడు నుండి ప్రత్యేక విమానంలో అధికారులు ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి తీసుకొచ్చిన సందర్భంగా వారి కుటుంభం సభ్యులను ప్రధాని కలుసుకున్నారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు కూడా వారి భౌతికకాయాలకు నివాళులర్పించారు. రాజ్‌నాథ్, దోవల్ ఆర్మీ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ఢిల్లీలోని సైనిక దవాఖాన నుంచి వారి భౌతికకాయాలను రావత్ నివాసానికి తరలించారు. ప్రజలు, ఆర్మీ సిబ్బంది సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడ ఉంచనున్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రావత్ దంపతులకు పుష్పాంజలి ఘటించారు.
బిపిన్ రావత్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు.
ఉత్తరాఖండ్ బిపిన్ రావత్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు.
అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, ఢిల్లీ గవర్నర్ అనిల్ బైజల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నివాళులు అర్పించారు.
కంటోన్‌మెంట్‌లోని బ్రార్ స్వ్వేర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పూర్తి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి గోర్ఖా రైఫిల్స్ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది.
కాగా, హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్దర్ అంత్యక్రియలు ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటికలో ప్రారంభం కాగా, బ్రిగేడియర్ లిద్దర్ భౌతికకాయం వద్ద రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. ఆయనతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హర్యానా ముఖ్యమంత్రి మోహన్ లాల్ ఖట్టర్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి లిద్దర్‌కు నివాళులు అర్పించారు.
పార్లమెంటు ఉభయ సభల సంతాపం
భారతదేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధూలికతో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 11 సైనికులకు పార్లమెంటు గురువారం సంతాపం తెలిపింది. హెలికాప్టర్ కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉభయ సభల్లో గురువారం ప్రకటన చేశారు. ఎంపీలందరూ సైనికులకు నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించారు.
ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలను విపక్షాలు గురువారం రద్దు చేశాయి. సైనికులకు నివాళులర్పించాయి. ప్రమాద ఘటనపై ఐఏఎఫ్ త్రివిధ దళాల దర్యాప్తునకు ఆదేశించినట్టు రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటుకు తెలిపారు.
More Stories
చంద్రయాన్-5 మిషన్‌కు కేంద్రం ఆమోదం
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు