పాక్ లో అంతులేని మైనారిటీల హక్కుల ఉల్లంఘనలు

 
* అంతర్జాతీయ మానవహక్కుల దినం కధనం 
 

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్‌లో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీల హక్కుల ఉల్లంఘనకు అంతు లేకుండా పోతున్నది.  దేశంలో  మతపరమైన మైనారిటీలపై  క్రమబద్ధంగా మతపరమైన స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించడం కొనసాగిస్తున్నందుకు  1998 అంతర్జాతీయ మత స్వేచ్ఛ చట్టం ప్రకారం పాకిస్తాన్ ను అమెరికా స్టేట్  డిపార్ట్‌మెంట్  ప్రత్యేక శ్రద్ధగల దేశాల జాబితాలో చేర్చింది.

క్రైస్తవులు, అహ్మదీయ ముస్లింలు, షియా ముస్లింలపై ప్రబలమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, యుద్ధ నేరాలు జరుగుతున్నా  చారిత్రాత్మకంగా, దేశం వ్యూహాత్మక స్థానం, దాని ప్రాముఖ్యత కారణంగా పాకిస్తాన్ చర్యలను అంతర్జాతీయ సమాజం పట్టించుకోవడం లేదు.

బ్రిటిష్ వారి వలస పాలన నుండి స్వాతంత్య్రం పొందిన తర్వాత 1947లో భారతదేశాన్ని విభజించడం ద్వారా ఆధునిక పాకిస్తాన్ రాజ్యంను సృష్టించారు. దక్షిణాసియా ముస్లింలకు ప్రత్యేక మాతృభూమి కోసం ముస్లిం లీగ్ చేసిన డిమాండ్ల కారణంగా ఏర్పడిన సామూహిక హింస మిలియన్ల మంది హిందువులు, సిక్కులు భారతదేశ భద్రత కోసం పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుండి పారిపోయేలా చేసింది. 

 
తత్ఫలితంగా, విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్‌లో హిందువుల సంఖ్య 15% నుండి 1951లో దాదాపు 2%కి తగ్గింది. 1998లో హిందువులు జనాభాలో 1.6% ఉన్నారు. సింధ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా   6.51 శాతం హిందువులు ఉన్నారు. 2017 జనాభా లెక్కల ప్రకారం, హిందూ జనాభా 0.19% కు తగ్గింది.

ఉదాహరణకు లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో కూడా, హిందూ/సిక్కు సమాజం 1941లో దాదాపు 40% ఉండగా, నేడు 1% కంటే తక్కువగా ఉంది, కేవలం రెండు హిందూ దేవాలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అదేవిధంగా, కరాచీలో, హిందువుల జనాభా 1947లో 51% నుండి 1951లో కేవలం 2%కి తగ్గింది.  అదే సమయంలో నగరంలో ముస్లిం జనాభా 42% నుండి 96%కి పెరిగింది.

దీనికి విరుద్ధంగా, విభజన సమయంలో చాలా మంది ముస్లింలు భారతదేశాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్‌కు వెళ్లినప్పటికీ, స్వతంత్ర భారతదేశంలో ముస్లింల శాతం పెరుగుతూనే ఉంది. భారతదేశం  1951 జనాభా లెక్కల ప్రకారం, ముస్లింలు జనాభాలో 9.8% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ముస్లింలు జనాభాలో 14.23% ఉన్నారు. 2050 నాటికి మొత్తం జనాభాలో వారి వాటా 18%కి పెరుగుతుందని అంచనా.  
 
దైవదూషణ చట్టాలు, అహ్మదీయ ముస్లిం విశ్వాసంపై ఆంక్షలు,  హిందూ, క్రిస్టియన్, సిక్కు బాలికల బలవంతపు మతమార్పిడులు ముఖ్యంగా మతపరమైన మైనారిటీలను రెండవ-తరగతి పౌరులుగా తగ్గించి, రాష్ట్ర,  ప్రభుత్వేతర వ్యక్తులచే స్థూల మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీశాయి. రాజ్యాంగం తన పౌరులకు 20-22, ఆర్టికల్స్ కింద మతపరమైన స్వేచ్ఛకు హామీ ఇచ్చినప్పటికీ, మైనారిటీలు దాడులు లేదా హింసకు భయపడకుండా తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా ఆచరించ లేకపోతున్నారు. 
 
దేవాలయాలు/మత స్థలాలు
పాకిస్తాన్ అనేక పురాతన హిందూ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలకు నిలయంగా ఉంది.  అయితే 1947లో దేశ విభజన జరిగినప్పటి నుండి హిందూ దేవాలయాల సంఖ్య, పరిస్థితిలో విపరీతమైన క్షీణత ఉంది. కొన్ని సంవత్సరాలలో వేలాది దేవాలయాలు ధ్వంసంకు గురయ్యాయి. అక్రమంగా ఆక్రమణలకు గురవడమో, మసీదులుగా మార్చడమో జరిగింది. 
 
అప్పటి నుండి, ముఖ్యంగా భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత కాలంలో. అక్కడ ఉన్న చాలా దేవాలయాలు కూడా శిథిలావస్థకు చేరి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. దేవాలయాలు, తీర్థయాత్ర స్థలాలు,  మత పెద్దలపై అనేక దాడులు జరుగుతున్నాయి.  ప్రభుత్వ అధికారులు, చట్టాన్ని అమలు చేసేవారు దేవాలయాలను రక్షించడంలో విఫలమయ్యారు . హిందూ సమాజం తమ దేవాలయాలను మరమ్మతులు చేయలేక పోతున్నది.  కొత్త వాటిని నిర్మించలేక పోతున్నది.
 
అపహరణాలు, బలవంతపు మార్పిడులు
అపహరణలు,  బలవంతపు మతమార్పిడులు పాకిస్తాన్‌లోని మైనారిటీ వర్గాలను వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువ హిందూ,  క్రైస్తవ బాలికలను లక్ష్యంగా చేసుకున్నాయి. తరచుగా, అపహరణకు గురైన తర్వాత, ఈ బాలికలు యాదృచ్ఛిక పురుషులతో బలవంతంగా వివాహం చేసుకొని, అత్యాచారంకు గురయి,  మానవ అక్రమ రవాణా వలయాలకు విక్రయించ బడుతున్నారు. లేదా వారిని  వ్యభిచారంలోకి నెట్టుతున్నారు. 
 
సింధ్‌లోని అనేక ఇస్లామిక్ సెమినరీలు తమ ముస్లిం విద్యార్థులను హిందూ బాలికలను మతం మార్చుకోమని ప్రేరేపిస్తాయి.  ఇది హజ్-ఎ-అక్బరీకి సమానం లేదా ముస్లింలకు గొప్ప మతపరమైన విధి అని చెబుతుంది. ఈ సెమినరీలు అపహరణ చేసిన హిందూ బాలికలను వారి ఇష్టానికి విరుద్ధంగా  ఇస్లాం మతంలోకి మార్చుతున్నాయి.  వారి వయస్సు రెండింతలు ఉన్న ముస్లిం పురుషులను వివాహం చేసుకోమని బలవంతం చేస్తాయి. వారు తమ కుటుంబాల భద్రత కోసం భయపడి మౌనంగా ఉంటె, అక్కడ కోర్టులలో చట్టబద్దత చేస్తున్నారు. 
 
హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆఫ్ పాకిస్తాన్,  హ్యూమన్ రైట్స్ వాచ్  2019 కంట్రీ రిపోర్ట్ ఆన్ పాకిస్తాన్ వంటి మానవ హక్కుల సంఘాలు గత ఏడాది దేశవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ మంది హిందూ,  క్రైస్తవ యువతులను వారి కుటుంబాల నుండి అపహరించి,  బలవంతంగా ఇస్లాంలోకి మార్చిన్నట్లు అంచనా వేశాయి. జనవరి 2004 నుండి  మే 2018 మధ్య, సింధ్ ప్రావిన్స్‌లో 7,430 హిందూ బాలికల అపహరణ కేసులు నమోదయ్యాయి.  అయితే వాస్తవ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్లు అంచనా. 
 
ఇస్లామిక్ తీవ్రవాదం, సెక్టారియన్ హింస

పాకిస్తాన్ సైన్యం భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్‌లలో తన విదేశాంగ విధాన ప్రయోజనాలను కొనసాగించడానికి, అలాగే తమ  దేశీయ ప్రాధాన్యతలకు మద్దతుగా తీవ్రవాద/మిలిటెంట్ గ్రూపులను చాలా కాలంగా ఉపయోగించుకుంది. పాకిస్తాన్ సైనిక-గూఢచార వ్యవస్థలు  1980ల చివరి నుండి భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తున్నాయి. 

 
భారత్ భూభాగంలోని జమ్మూ, కాశ్మీర్ లో పలు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద గ్రూపులతో అనేక సీమాంతర దాడులకు పాల్పడ్డారు.  2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జైషే మహ్మద్ జరిపిన దాడిలో 40 మంది భారతీయ భద్రతా సిబ్బంది మరణించారు. పుల్వామా దాడి తరువాత, ఐక్యరాజ్యసమితిలో జెఎమ్ నాయకుడు మౌలానా అజర్ మసూద్‌ను రక్షించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370,  35A రద్దు ద్వారా భారతదేశం పూర్తిగా,  ప్రజాస్వామ్యబద్ధంగా జమ్మూ,  కాశ్మీర్‌ను భారత యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ వంటి వారు  ఏకపక్షంగా అణుయుద్ధం జరగగలదని  బెదిరించడం ద్వారా భారతదేశంతో ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రయత్నం చేశారు.
అంతేకాకుండా, భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో స్వతంత్ర సిక్కు దేశాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఖలిస్తాన్ తీవ్రవాదులకు కూడా పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది.  ఇస్లామిక్ పాలన, హింసాత్మక జిహాద్ ,  ముస్లిమేతరుల పట్ల ద్వేషాన్ని ప్రోత్సహించే అనేక సమూహాలు  దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా పనిచేస్తున్నాయి.

ఈ సమూహాలలో చాలా మంది తమ తీవ్రవాద అభిప్రాయాలకు ఆపాదించని మతపరమైన మైనారిటీలు, ముస్లింలపై పాకిస్తాన్‌లో పెద్ద ఎత్తున  దాడులను ప్రారంభించారు. 2019లో, ఇస్లామిక్ స్టేట్ క్వెట్టాలోని హజారా కమ్యూనిటీకి చెందిన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బహిరంగ మార్కెట్‌లో జరిపిన బాంబు దాడికి, 24 మంది అమాయక ప్రజలు మృతి చెందారు. అలాగే ఒక ప్రధాన సూఫీ మందిరంపై దాడికి బాధ్యత వహించింది. లాహోర్‌లో కనీసం పది మంది మరణించారు.

                                                                                                                                                                             (ఇంకా ఉంది)

(ది హిందూ అమెరికన్ ఫౌండేషన్ నివేదిక ఆధారంగా)