
భారత స్వాతంత్య్రోద్యమంలో పోరాడిన ప్రముఖ తెలుగు స్వాతంత్య్ర సమర యోధులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ ఔట్రీచ్ బ్యూరో (ఆర్.ఒ.బి.) ఫోటో ఎగ్జిబిషన్ హైదరాబాద్ లో నిర్వహిస్తోంది.శనివారం నారాయణగూడలో ని కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్‌లో ఈ ప్రదర్శనను హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ, ఈశాన్య రాష్ట్రాల , అభివృధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ స్వాత్రంత్య్ర పోరాటం పాల్గొన్న మహనీయులను, స్మరించుకోవడానికి,యోధుల త్యాగాలను యువతకు తెలియజేసేందుకు ఈ ప్రదర్శన ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర సాధనకు మన పూర్వీకులు చేసిన కృషిని, చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను సందర్శించాలని ఆయన పిలుపునిచ్చారు.
పీఐబి,ఆర్వోబి డైరెక్టర్ శృతిపాటెల్ మాట్లాడుతూ విదేశీ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి తెలుగు స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలు తెలిపే సుమారు నలభై కి పైగా చిత్రాలను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రదర్శన నవంబర్ 20 నుండి 22 వరకు-మూడు రోజులపాటు ఉంటుందని ఆమె తెలిపారు.
పింగళి వెంకయ్య, కుమురం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, సురవరం ప్రతాపరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ తదితర స్వాతంత్ర సమరయోధల పాత్రలను తెలిపే విషయాలను, చిత్రాలను ఈ ఎక్సిబిషన్ లో ప్రదర్శించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన ప్రచురణల విభాగం స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన పుస్తక ప్రదర్శనను ఏర్పాటుచేసింది.
More Stories
హనుమాన్ జయంతి యాత్రకు సిపి ఆనంద్ భరోసా
ప్రభుత్వ భూముల్లో విల్లాలు.. కేటీఆర్ వందల కోట్ల కుంభకోణం
తెలంగాణాలో మూడు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు