
పంచాయతీ ఎన్నికలలో వలే రాష్ట్ర వ్యాప్తంగా జెడ్‌పిటిసి, ఎంపిటి
ముఖ్యంగా వైసిపి ప్రముఖ నాయకుల స్వస్థలంలో ఓటమి చవిచూడవలసి వచ్చింది. మరోవంక, ఎన్నికలలో అనేక అక్రమాలు, అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలనుకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ గెలుపుకు దారితీసిన కొట్లాటలో తేడాలు పలుచోట్ల చాలా స్వల్పంగా ఉండడం అధికార పక్షానికి ఆందోళన కలిగిస్తున్నది.
ప్రభుత్వ వ్యతిరేకంగా క్రమంగా పుంజుకొంటున్నట్లు స్పష్టం అవుతున్నది. రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలకు అనుకూలమైన అవకాశం ఉన్నదని, ఉపయోగించుకోవాలని గత వారం తిరుపతిలో రాష్ట్ర బిజెపి నాయకులకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేసిన సూచన వాస్తవంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకోవడంలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఇంకా వెనుకబడి ఉన్నట్లు భావించవలసి వస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 11 జెడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, 8 స్థానాలు వైసిపి, 3 స్థానాలను టిడిపి గెలుచుకుంది.123 ఎంపిటిసి స్థానాలకు కౌంటింగ్ జరగ్గా..వైసిపి 80, టిడిపి 33, జనసేన 5, సిపిఎం 2, సిపిఐ1, బిజెపి1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. విజయనగరం జిల్లాలో తొమ్మిది ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఆరు వైసిపి, రెండు టిడిపి, ఒక చోట బిజెపి అభ్యర్థి గెలుపొందారు.
తూర్పుగోదావరి జిల్లాలో 21 ఎంపిటిసి స్థానాలకు కౌంటింగ్ నిర్వహించగా ఎనిమిది వైసిపి, ఆరు టిడిపి, మూడు స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. రెండు చోట్ల సిపిఎం అభ్యర్థులు, మరోస్థానంలో సిపిఐ అభ్యర్థి విజయం సాధించారు. ఆలమూరు జన్నాడలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కర్నూల్ జిల్లాలో ఏడు ఎంపిటిసి, ఒక జెడ్‌పిటిసి స్థానాలను వైసిపి కైవశం చేసుకుంది.
పశ్చిమగోదావరి జిల్లాలో 15 ఎంపిటిసి, ఒక జెడ్‌పిటిసి స్థానానికి నోటిఫికేష్ వెలువడగా..ఒక్క ఎంపిటిసి స్థానానిు ఏకగ్రీవంగా వైసిపి దక్కించుకుంది. 14 ఎంపిటిసి, ఒక్క జెడ్‌పిటిసికి ఎనిుకలు జరగ్గా..పది వైసిపి, మూడు టిడిపి, ఒకచోట జనసేన గెలుపొందింది. ఒక్క జెడ్‌పిటిసి స్ధానానిు వైసిపి గెలుచుకుంది.
కడప జిల్లాలో మూడు ఎంపిటిసి, ఒక్క జెడిపిటిసి స్థానాన్ని వైసిపి కైవశం చేసుకుంది. అనంతపురంలో 16 ఎంపిటిసి, ఒక జెడ్‌పిటిసి స్థానానికి కౌంటింగ్ నిర్వహించగా పది వైసిపి, ఆరు టిడిపి, చిలమత్తూరు జెడ్‌పిటిసి స్థానాన్ని వైసిపి అభ్యర్థి కైవసం చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో 15 ఎంపిటిసి స్థానాల్లో పది వైసిపి, ఐదు టిడిపి దక్కించుకుంది. ఒక్క జెడ్‌పిటిసి స్థానాన్ని టిడిపి గెలుచుకుంది.
కృష్ణా జిల్లాలో మూడు జెడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరగ్గా రెండు స్థానాల్లో వైసిపి, ఒక స్థానంలో టిడిపి విజయం సాధించాయి. ఏడు ఎంపిటిసి స్థానాల్లో ఆరు వైసిపి, ఒకటి టిడిపి గెలుచుకుంది.ప్రకాశం జిల్లాలో ఏడు ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. నాలుగు స్థానాల్లో వైసిపి, రెండు స్థానాలు టిడిపి,ఒకటి జనసేన అభ్యర్థి గెలుపొందారు.
నెల్లూరు జిల్లాలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా మూడు వైసిపి, ఒకటి టిడిపి గెలుపొందింది.విశాఖలో ఏడు ఎంపిటిసి స్థానాల్లో నాలుగు వైసిపి, రెండు టిడిపి, ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఒక్క జెడిపిటిసి స్థానాన్ని వైసిపి కైవశం చేసుకుంది. గుంటూరులో రెండు జెడ్‌పిటిసి స్థానాల్లో ఒక్కస్థానం వైసిపి ఏకగ్రీవం, ఒకటి టిడిపి గెలుచుకుంది.13 ఎంపిటిసి స్థానాలకు రెండు ఏకగ్రీవం కాగా 11 వాటికి ఎన్నికలు నిర్వహించారు. 9 వైసిపి,2 టిడిపి గెలుచుకుంది.
చిత్తూరులో 8 ఎనిమిది ఎంపిటిసి స్థానాలకు వైసిపి ఐదు, టిడిపి మూడు స్థానాల్లో గెలుపొందింది. రెండు జెడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఒకటి వైసిపి ఏకగ్రీవం, కౌంటింగ్‌లో ఆ స్థానాన్ని వైసిపి గెలుచుకుంది.
More Stories
అరుణాచల్ పై ‘జీ20’ సాక్షిగా చైనాకు భారత్ ఝలక్
వివేకా హత్యకేసులో విచారణాధికారిని మార్చమన్న సుప్రీంకోర్టు
కృష్ణాజలాల పున:పంపిణీ సాధ్యం కాదన్న టైబ్యునల్