భారత్ లో కీలక స్థావరాలపై చైనా సైబర్ దాడులు!

గత ఏడాదిగా సరిహద్దు ప్రాంతం లడఖ్‌లో ఏర్పడిన  ప్రతిష్టంభన విషయమై భారత్ పై వత్తిడి తీసుకొచ్చేందుకు మన దేశంలోని ప్రజాపయోగ ప్రదేశాలు,  మౌలిక సదుపాయాలను లక్ష్యంగా సైబర్ దాడులకు చైనా పాల్పడుతున్నట్లు అమెరికాలో కీలక సంస్థ  నివేదిక వెల్లడించింది.  ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ రికార్డెడ్ ఫ్యూచర్ అధ్యయనం ఆధారంగా ఈ కధనాన్ని కొద్దికాలం క్రితం న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. 

ఈ కధనం ప్రకారం చైనీస్ మాల్వేర్ భారతదేశం అంతటా విద్యుత్ సరఫరాను నిర్వహించే నియంత్రణ వ్యవస్థలలోకి, అధిక-వోల్టేజ్ ట్రాన్స్మిషన్ సబ్‌స్టేషన్, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌తో పాటుగా ప్రవహింప చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ముంబైలో భారీ విద్యుత్తు అంతరాయంకు చైనా హ్యాకింగ్‌ కారణం కావచ్చని ఈ నివేదిక స్పష్టం చేసింది.

అయితే ఆ సమయంలో, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటువంటి వాదనలను “ఊహాగానాలు, కల్పన” అని కొట్టిపారేసింది.
తాజాగా అమెరికా కాంగ్రెస్‌కు ద్వైపాక్షిక సలహా బృందం ఇచ్చిన నివేదికలో చైనా సైన్యంతో సంబంధం ఉన్న గ్రూపులు భారతదేశానికి వ్యతిరేకంగా సైబర్ కార్యకలాపాలు నిర్వహించాయని పేర్కొంది.

అమెరికా.-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ (యు ఎస్ సి సి) వార్షిక నివేదిక చైనాకు సంబంధించిన జాతీయ భద్రత, ఆర్థిక సమస్యలపై కాంగ్రెస్ కు, అమెరికా  పరిపాలనకు పక్షపాతరహిత సలహాలను అందించడం లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. “2020 సరిహద్దు వివాదం తర్వాత 2021 వరకు కొనసాగుతుంది, చైనా సైన్యం పి ఎల్ ఎ  సైబర్‌స్పియోనేజ్, ఇతర చైనా ప్రభుత్వ ప్రాయోజిత సంస్థలు భారతదేశంలోని లక్ష్యాలపై తమ దాడులను గణనీయంగా పెంచాయి.” అని  యు ఎస్ సి సి తెలిపింది.

భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న ఒక చైనా సమూహం “పీఎల్ఎ, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీకి అనుబంధంగా ఉన్న హ్యాకర్ల మాదిరిగానే సాంకేతికతలు, వనరులను ఉపయోగిస్తోంది” అని కూడా పేర్కొంది.

ఈ బృందం సైబర్ దాడులతో భారతదేశ పవర్ గ్రిడ్‌లో కనీసం 10 ప్రాంతీయ ముఖ్యమైన నోడ్‌లను, రెండు సముద్ర ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో ముంబైలో విద్యుత్తు అంతరాయానికి సైబర్ దాడులే కారణమని ఈ  నివేదిక స్పష్టం చేసింది. భారతదేశానికి వ్యతిరేకంగా చైనా సైబర్ కార్యకలాపాలు 2021లో కొనసాగుతున్నాయని, వివిధ రంగాలకు విస్తరించిందని ఈ నివేదిక వెల్లడించింది.

“2021 మొదటి ఆరు నెలల్లో, పీఎల్ఎ  సైబర్‌స్పియోనేజ్ యూనిట్‌లతో సన్నిహితంగా అనుబంధంగా ఉన్న మరొక సమూహం భారతీయ ఏరోస్పేస్ కంపెనీలు, డిఫెన్స్ కాంట్రాక్టర్లు, టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్లను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంది” అని ఆ నివేదిక పేర్కొంది.

గత సంవత్సరం గాల్వాన్‌లో జరిగిన ఘర్షణ ఈ నివేదిక ప్రస్తావిస్తూ ఇది చైనా పట్ల భారతదేశం యొక్క విధానంలో సవరణలకు దారితీసిందని పేర్కొంది. 2017లో డోక్లామ్‌లో ప్రతిష్టంభన జరిగిన భూటాన్‌లో చైనా నిర్మాణ కార్యకలాపాలను కూడా నివేదిక గమనించింది. భారత్‌కు సమీపంలో ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్‌లు, ఎయిర్ డిఫెన్స్ స్టేషన్‌లను ఉంచే ప్రాంతంలో చైనా “సైనిక గ్రామాలను” నిర్మిస్తోందని నివేదిక వాదించింది.