అత్యంత సంపన్న దేశంగా అమెరికాను వెనుకకు నెట్టిన చైనా

ప్రపంచ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉన్న అమెరికాను సంపదలో చైనా వెనక్కు నెట్టింది. అత్యంత ధనిక దేశంగా అవతరించింది. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచ సంపద మూడు రెట్లు పెరగ్గా.. చైనా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ ఆదాయంలో 60 శాతం కన్నా ఎక్కువ కల్గిన పది దేశాల ఆర్థిక వ్యయాలను పరిశీలిస్తున్న కన్సల్టెంట్స్‌ మెకిన్‌సే అండ్‌ కో పరిశోధన విభాగం ఈ వివరాలను నివేదికలో వెల్లడైంది.

గ‌డిచిన రెండు ద‌శాబ్ధాల్లో ప్ర‌పంచవ్యాప్తంగా సంప‌ద మూడింత‌లు పెరిగిన‌ట్లు విశ్లేష‌కులు అంచ‌నా వేశారు. ప‌ది అగ్ర‌దేశాల జాతీయ బ్యాలెన్స్ షీట్ల‌ను ప‌రిశీలించిన ఆ ఏజెన్సీ ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. మెక‌న్సీ కంపెనీ ప్ర‌కారం ఆ ప‌ది దేశాల వ‌ద్ద ప్ర‌పంచంలోని సుమారు 60 శాతం సంప‌ద ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ దేశాల జాబితాలో అమెరికా, చైనా, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, యూకే, కెన‌డా, ఆస్ట్రేలియా, జ‌పాన్‌, మెక్సికో, స్వీడ‌న్‌లు ఉన్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఇప్పుడు మ‌నం సంప‌న్నుల‌మ‌య్యామ‌ని జూరిచ్‌లోని మెక‌న్సీ గ్లోబ‌ల్ ఇన్స్‌టిట్యూట్ భాగ‌స్వామి జాన్ మిచ్‌కి తెలిపారు.

మెక‌న్సీ ఏజెన్సీ నివేదిక ప్ర‌కారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2020లో సంప‌ద 156 ట్రిలియ‌న్ డాల‌ర్ల నుంచి 514 ట్రిలియ‌న్ల డాల‌ర్లుకు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. దాంట్లో ఒక్క చైనాలోనే సంప‌ద మూడో వంత పెరిగిన‌ట్లు తేల్చేశారు. 2000 సంవ‌త్స‌రంలో ఏడు ట్రిలియ‌న్ల డాల‌ర్లు ఉన్న చైనా సంప‌ద ఇప్పుడు 120 ట్రిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ట్లు పేర్కొన్నారు.

ప్ర‌పంచ వాణిజ్య సంస్థ‌లో చైనా చేరిన త‌ర్వాత ఆ దేశ సంప‌ద దూసుకెళ్తున్న‌ట్లు మెక‌న్సీ త‌న రిపోర్ట్‌లో తెలిపింది. మ‌రో వైపు అమెరికాలో ప్రాప‌ర్టీ విలువ‌లు పెరిగినా.. ఆ దేశ సంప‌ద 90 ట్రిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే రెండు దేశాల్లోనూ ప‌ది శాతం సంద‌ప‌న్న సంప‌న్నుల వ‌ద్దే ఉన్న‌ట్లు గుర్తించారు.

అమెరికా, చైనాలో ఉన్న సంప‌న్నుల షేర్లు కూడా శ‌ర‌వేగంగా వృద్ధి చెందుతున్న‌ట్లు రిపోర్ట్‌లో వెల్ల‌డించారు. మెక‌న్సీ కంప్యూట‌ర్ నివేదిక ప్ర‌కారం.. ప్ర‌పంచ వ్యాప్తంగా 68 శాతం నిక‌ర సంప‌ద మొత్తం రియ‌ల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్న‌ది. ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌, మెషిన‌రీ, ఎక్విప్మెంట్, ప్రాప‌ర్టీ, పేటెంట్స్ లాంటి వ‌ద్ద కొంత బ్యాలెన్స్ సంప‌ద ఉన్న‌ట్లు గుర్తించారు.

ఈ నివేదిక ప్రకారం రెండు దశాబ్దాల్లో నికర ఆస్తుల విలువ అమాంతంగా పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా స్థూల జాతీయోత్పత్తి పడిపోయింది. దీని ద్వారా ఆస్తుల విలువ పెరిగి.. వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. ఆస్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయి దీర్ఘకాల సగటు కంటే దాదాపు 50 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సంపద వృద్ధి చెందడం పలు దుష్ఫ్రబావాలకు దారి తీసే అవకాశాలున్నాయి. 
 
ద్రవ్యోల్బణానికి మించి ఈ ఆస్తుల విలువ పెరగడం అనేక ప్రశ్నలను రేకేత్తిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ విలువ పెరగడం వల్ల నివాసాలను అనేక మంది కొనుగోలు చేయలేక ఇబ్బందులకు గురౌతున్నారు. దీని వల్ల ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది. 2008లో అమెరికాలో గృహలకు సంబంధించి బబుల్‌ ఇలాగే పేలిపోయింది. 
 
అలాగే దీని వల్ల చైనాలోని ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్‌ వంటి పాపర్టీ డెవలపర్స్‌ కూడా ఇబ్బందులకు గురికావచ్చు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం.. ప్రపంచ జిడిపిని పెంచడం కోసం ఉత్పాదకతపై పెట్టుబడులు పెంచాలని మెకన్సీసే నివేదిక తెలిపింది.