
మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి ఈడీ విచారణ ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలని అనిల్ దేశ్‌ముఖ్ కోర్టును కోరారు.
అయితే ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ముందుగా జైలు కూడు తినండి. ఒకవేళ తినలేకపోతే అప్పుడు మీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటాం అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే తన వయసు 71 ఏళ్లు కావడంతో జైలులో తనకు ప్రత్యేకమైన బెడ్ కావాలని కోరడంతో కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది.
ఆయనకు కేటాయించిన గదిలో బెడ్ ఏర్పాటుకు అనుమతించింది.ఈనెల 1న మనీ ల్యాండరింగ్ కేసులో అనిల్ దేశ్‌ముఖ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ముంబయి కార్యాలయంలో 12 గంటలపైనే ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని నిర్దేశించినట్టు ఆరోపణలు రావడంతో అనిల్ దేశ్‌ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ దేశ్‌ముఖ్‌ను ఈ నెల 2న ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపు 12 గంటలపాటు ముంబైలోని ఈడీ ఆఫీసులో అనిల్ దేశ్‌ముఖ్‌ను ప్రశ్నించిన అనంరతం ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. కాగా, మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ ఏడాది ప్రారంభంలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సచిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు మహారాష్ట్రను కుదిపేశాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో అనిల్ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి పరంబీర్ సింగ్‌పై కూడా లుక్‌ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయనపై కూడా పలు ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం పరంబీర్ పరారీలో ఉన్నారు.
More Stories
పాన్-ఆధార్ లింక్ గడువు తేదీ పెంపు
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఆర్ధిక వ్యవస్థ
ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభంపై భారత్ అప్రమత్తం