
కర్నూల్ జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని ఆయన శతజయంతి సందర్భంగా సమరసత వేదిక ఆధ్వర్యంలో శనివారం కర్నూల్ లో జరిగిన మహసభ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
సంజీవయ్య స్వగ్రామం పెదపాడులో సంజీవయ్య గారి విగ్రహం పెట్టాలని, కమ్యూనిటీ హాలను నిర్మించి అందులో వారి జీవన విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్షినీ ఏర్పాటు చేయాలని, గ్రామీణ యవత ఉపాధి కల్పన కొరకు సాంకేతిక శిక్షణ సంస్థను స్థాపించాలని కూడా కోరుతూ సభ తీర్మానించింది.
వేదిక రాష్ట్ర అధ్యక్షులు మన్మధరావు అధ్యక్షతన కర్నూల్ లోని పాత బస్ స్టాండ్ డా.అంబెడ్కర్ విగ్రహం వద్ద జోరు వానలో సమరసత వేదిక ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. డా.అంబెడ్కర్ విగ్రహంకు,సంజీవయ్య చిత్ర పటానికి వక్తలు పూలమాలలు వేయడంతో సభ ప్రారంభం అయింది.
ప్రముఖ రచయిత, జాగృతి వారపత్రిక మాజీ సంపాదకులు డా.వడ్డీ విజయ సారథి వ్రాసిన దామోదరం సంజీవయ్య జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందేశాన్ని ఈ సందర్భంగా చదివి వినిపించారు. డా. వడ్డి విజయ సారథి, ప్రొఫెసర్ జనప వెంకట రాజం, సామజిక సమరసత జాతీయ కన్వీనర్ కె శ్యామ్ ప్రసాద్, జి.రఘురామయ్య, లక్ష్మీనారాయణ, న్యాయవాది, మాజీ మేయర్ అనంతయ్య ప్రసంగించారు.
సభ ప్రారంభం లో కళాకారులు తమ పాటలతో ప్రజలను ఆకట్టు కున్నారు. సభ చివరలో సంజీవయ్య స్వయంగా వ్రాసి స్వర కల్పన చేసిన రెండు పాటలను=సరస్వతీమాత పై,వినాయకునిపై పాడి వినిపించారు. తొలుత కర్నూల్ లో మూడు చోట్ల సంజీవయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అంతకు ముందు, పెదపాడు గ్రామంలో సంజీవయ్య ఇంటివద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
More Stories
వివేకా హత్యకేసులో విచారణాధికారిని మార్చమన్న సుప్రీంకోర్టు
కృష్ణాజలాల పున:పంపిణీ సాధ్యం కాదన్న టైబ్యునల్
నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం – 3 రాకెట్