కెనడా నుంచి కాశీకి అన్న‌పూర్ణ‌దేవి విగ్ర‌హం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసిలో కొలువై ఉండే అన్న‌పూర్ణ‌దేవి విగ్ర‌హం వందేళ్ల క్రితం చోరీ అయ్యింది. ఇటీవ‌ల కెన‌డాలో ఆ విగ‌హాన్ని గుర్తించారు. అయితే మాతా అన్న‌పూర్ణేశ్వ‌రి విగ్ర‌హాన్ని ఢిల్లీకి తీసుకువ‌చ్చారు. ఆ విగ్ర‌హాన్ని ఇప్పుడు వార‌ణాసిలోని కాశీ విశ్వ‌నాథ ఆల‌యంలో ప్ర‌తిష్టించ‌నున్నారు.

ఇవాళ ఢిల్లీ నుంచి కాశీ వ‌ర‌కు అన్న‌పూర్ణ విగ్ర‌హంతో ర్యాలీ ప్రారంభించారు. 15వ తేదీన సీఎం యోగి ఆదిత్య‌నాథ్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించ‌నున్నారు.  అన్న‌పూర్ణ‌దేవి విగ్ర‌హాన్ని యూపీ ప్ర‌భుత్వానినికి కేంద్రం అప్ప‌గిస్తుంద‌ని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. 

నాలుగు రోజుల యాత్ర సంద‌ర్భంగా అన్న‌పూర్ణ విగ్ర‌హాన్ని తొలుతు ఢిల్లీ నుంచి అలీఘ‌డ్‌కు తీసుకువెళ్ల‌నున్నారు. అక్క‌డ నుంచి 12వ తేదీన క‌న్నౌజ్‌కు త‌ర‌లిస్తారు. ఆ త‌ర్వాత 14వ తేదీన అయోధ్య‌కు తీసుకువెళ్తారు. ఇక చివ‌రిగా 15వ తేదీన కాశీ విశ్వ‌నాథ ఆల‌యంలో ఆ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టిస్తారు.

అన్న‌పూర్ణాదేవి విగ్రహం ఎత్తు 17 సెమీ, వెడ‌ల్పు 9 సెమీ ఉంది. ఇండియాకు చెందిన పురాత‌న విగ్ర‌హాలు సుమారు 157 విదేశాల్లో ఉన్న‌ట్లు గుర్తించారు. అయితే ఆ విగ్ర‌హాలు, పెయింటింగ్‌ల‌ను తీసుకువ‌చ్చేందుకు ఆయా దేశాల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.