ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తలు ఇటుకలతో దాడి

ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తలు ఇటుకలతో దాడి
కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకుంది. కన్నూర్‌లోని ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేస్తున్నారనే విషయం తెలియగానే సీపీఎం కార్యకర్తలు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.  తిరువ‌నంత‌పురంలో ఉన్న విజ‌య‌న్ అద్దె ఇంటి ముందు ఇవాళ భారీ ఎత్తున సీపీఎం కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.  
 
అంతటితో ఆగకుండా ఆగ్రహంతో ఊగిపోయిన వాళ్లు బేక‌రీ జంక్ష‌న్ వ‌ద్ద ఉన్న ఆ ఇంటి ముందు ఈడీ వాహ‌నాన్ని సీపీఎం కార్య‌క‌ర్త‌లు ధ్వంసం చేశారు. హెల్మెట్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, రాళ్ల‌తో అటాక్ చేశారు. అక్క‌డ మోహ‌రించిన సిబ్బందిపై దాడి చేశారు.  పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు,  కేంద్ర భద్రతా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాడికి గురైన వాహనంలో మహిళా అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. 
 
ఈడీ సోదాలు కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో ఈ త‌తంగం జ‌రిగింది. అంతేకాదు, కారును ఇటుకలతో ధ్వంసం చేశారు. విజయన్ అభిమానులు, వామపక్ష కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై రాళ్లు రువ్వుారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. చివరకు అతికష్టంతో వారిని పోలీసులు అక్కడ నుంచి వెళ్లగొట్టారు. పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు.
దాడుల్లో పాల్గొన్న ఈడీ అధికారులు, కేంద్ర భద్రతా సిబ్బంది మాజీ ముఖ్యమంత్రి ఇంటి నుంచి వెళ్ళిపోతుండగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు వారు అద్దెకు తీసుకున్న వాహనాలను చుట్టుముట్టి అడ్డుకున్నారు. కార్లపై రాళ్లు, ఇటుకలు విసరడంతో వాటి విండ్‌షీల్డ్‌లు, ఇతర కిటికీలు, బయటి రియర్‌వ్యూ మిర్రర్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
పెద్ద సంఖ్యలో ఉన్న నిరసనకారులు, ఈడీకి, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనాలను తన్నారు, కిటికీలు, విండ్‌షీల్డ్‌లపై పిడికిళ్లతో, కర్రలతో బాదారు, వాటిపై కుళ్ళిన గుడ్లు కూడా విసిరారు. వాహనాల డ్రైవర్లలో ఒకరికి గాయమైనట్లు సమాచారం. ఆ తర్వాత ఈడీ అధికారులు నిరసనకారులపై ఫిర్యాదు నమోదు చేయడానికి తంపానూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
 
వంద‌ల సంఖ్య‌లో పార్టీ కార్య‌క‌ర్త‌లు విజ‌య‌న్ ఇంటికి దూసుకొచ్చారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. ఇంటి ఆవ‌ర‌ణ‌లో ర‌క్ష‌ణ‌గా ఉన్న బ‌ల‌గాల‌పై నిర‌స‌న‌కారులు రాళ్లు రువ్వారు. సీనియ‌ర్ సీపీఎం నేత‌లు వారిని అదుపులోకి తెచ్చారు.  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బందితో కలిసి ఈడీ అధికారులు బుధవారం తెల్లవారుజామున తిరువనంతపురంలోని విజయన్ ఇటీవల అద్దెకు తీసుకున్న ఇంటితో సహా ఆ ప్రాంగణాన్ని దిగ్బంధించారు. ఈ సమయంలో విజయన్, ఆయన కుటుంబం ఇంట్లోనే ఉన్నారు.