తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి 16 చైనా యుద్ధ విమానాలు

తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్(ఎడిఐజెడ్)లోకి శనివారం 16 చైనా యుద్ధ విమానాలు ప్రవేశించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తైవాన్ నైరుతి తీరంలోకి అవి ప్రవేశించాయి. అయితే తైవాన్ దళాలు రేడియో హెచ్చరికలు కూడా చేశాయి.   
 
అక్టోబర్ తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో చైనా యుద్ధ విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి ప్రవేశించడం అన్నది ఇదే మొదటిసారి. తైవాన్ సార్వభౌమాధికార ప్రదేశం కంటే ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ పెద్దది. అది తైవాన్ తీరానికి 12 నాటికల్ మైల్స్ వరకు విస్తరించి ఉంటుంది.
 
చైనా యుద్ధ విమానాలు తరచూ తైవాన్ గగనతలాన్ని ఉల్లంఘిస్తుంటాయి. యూరోపియన్ పార్లమెంటు బృందం మూడు రోజుల పర్యటనపై తైపీకి వచ్చిన మరునాడే అంటే శనివారం చైనా విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌లోకి ప్రవేశించాయి. 
 
యూరోపియన్ యూనియన్-తైవాన్ రాజకీయ సంబంధాలను పెంపొందించుకునేందుకు ప్రజాస్వామ్య ప్రక్రియలో విదేశీ జోక్యంపై ఏరాటైన యూరోపియన్ పార్లమెంట్ కమిటీకి చెందిన ఏడుగురు శాసనకర్తలు గత వారమే తైవాన్ సందరించారు. తమ సందర్శన చైనాను రెచ్చగొట్టడం కాదని కూడా యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యులు తెలిపారు.