
రాజన్న సిరిసిల్ల పర్యటనలో మంత్రి కె టి రామారావుకు నిరసన సెగ తగిలింది. ఫ్లకార్డులతో నిరసన తెలిపేందుకు యత్నించిన నేరళ్ల బాధితుడు కోల హరీష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కోల హరీష్ ఇంటి ముందు పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేరెళ్ల ఘటన జరిగి ఐదేళ్లు దాటినా దళితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నేరెళ్ల బాధితులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు నేరెళ్ల బాధితులకు చిత్రహింసలకు చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హరీశ్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల పట్టణంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్. కేడీసీసీ బ్యాంక్, రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని ప్రారంభించారు. తర్వాత అటవీ భూముల సమస్యపై కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొమ్మిది రాజకీయ పార్టీలతో అవగాహన సదస్సు నిర్వహించారు.
8 వేల ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని సదస్సులో కేటీఆర్ తెలిపారు. 67 గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. నవంబర్ 8 నుంచి గ్రామాల వారిగా సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న పోడు రైతుల అర్జీలని పరిశీలిస్తామని, భవిష్యత్‌లో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా.. ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
మరోవంక, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాకలో ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామాల్లో రోడ్లు బాగుచేయాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ ఎమ్యెల్యే దాసరి మనోహర్ రెడ్డిని స్థానికులు, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఎన్నో సార్లు రోడ్డు రిపేర్ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికులు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొదురుపాకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్లు బాగు చేసేవరకు వెళ్లనిచ్చేది లేదని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కారు ముందు స్థానికులు బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే దాసరి అక్కడకు రావడంతో స్థానికులు ఆయనను అడ్డుకొని నిరసన తెలిపారు.
More Stories
హనుమాన్ జయంతి యాత్రకు సిపి ఆనంద్ భరోసా
ప్రభుత్వ భూముల్లో విల్లాలు.. కేటీఆర్ వందల కోట్ల కుంభకోణం
తెలంగాణాలో మూడు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు