ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకారిణి సమావేశాలు ప్రారంభం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి  మండలి మూడు రోజుల సమావేశాలు కర్ణాటకలోని ధార్వాడ్ లో నేడు ప్రారంభమయ్యాయి.సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోస్బాలే జీతో కలిసి భారతమాత విగ్రహానికి పూలమాలలు వేసి సమావేశాలను ప్రారంభించారు.

దేశంలోని దాదాపు 350 మంది కార్యకర్తలు, ప్రాంత్  సంఘచాలక్‌లు, కార్యవాహులు, ప్రచారకులు, అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు, వివిధ సామజిక సంస్థల ఆల్‌భారత్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం సంఘ్ పని తీరు, కార్యక్రమాల విస్తరణ, కార్యకర్తల అభివృద్ధి ప్రణాళికపై చర్చించనున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై ఇటీవల జరిగిన హింసపై కూడా తీర్మానం చేయనున్నారు.

సమావేశం ప్రారంభంలో  సంస్కార భారతి అఖిల భారత ఆర్గనైజింగ్ కార్యదర్శి అమీర్ చంద్, కన్నడ రచయిత  జి.వెంకట్ సుబ్బయ్య, స్వాతంత్య్ర సమరయోధుడు, పాత్రికేయుడు హెచ్ హెడ్ దొరస్వామిలతో ఇటీవల మృతి చెందిన ప్రముఖులకు నివాళులు అర్పించారు. 

ప్రముఖ కవి డా. హెచ్. సిద్దలింగయ్య, రాజకీయవేత్త ఆస్కార్ ఫెర్నాండెజ్, స్వామి అధ్యాత్మ నంద జీ, స్వామి ఓంకారానంద్ జీ, స్వామి అరుణగిరి జీ, సీనియర్ జర్నలిస్టు  శ్యామ్ ఖోస్లా, దైనిక్ జాగరణ్ యజమాని యోగేంద్ర మోహన్ గుప్తా, గీతా ప్రెస్ గోరఖ్‌పూర్ అధ్యక్షుడు  రాధేశ్యామ్ కె. రచయితలు నరేంద్ర కోహ్లి, కాంగ్రెస్ ఎంపీ  రాజేష్ సతవ్, మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ, మాజీ గవర్నర్  జగ్మోహన్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  కళ్యాణ్ సింగ్, జర్నలిస్ట్  రోహిత్ సర్దానా,  సుందర్ లాల్ బహుగుణ (చిప్కో ఉద్యమం) ), అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి జీ మహారాజ్, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి   వీరభద్ర సింగ్ ప్రభూతులకు నివాళులు అర్పించారు.