తండ్రి కుర్చీకే కేటీఆర్ ఎసరు… `ఆపరేషన్ భద్రావతి’ 

తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో  టీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతోండగా, ఆ పార్టీకి అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులైన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను ఉద్దేశించి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతున్నది.టీఆర్ఎస్ ప్లీనరీకి సంబంధించిన ప్రచార చిత్రాల్లో ఎక్కడా మంత్రి కేటీఆర్ ఫొటోలు కనబడకపోవడం,సీఎం కేసీఆర్ మాత్రమే కనిపిస్తుండటం వెనుక పెద్ద కథే ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఎంపీ అరవింద్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ‘ఆపరేషన్ హైద్రావతి’ పేరుతో ఓ సంచలన వీడియోను పోస్ట్ చేశారు.
ఆయన కధనం మేరకు తండ్రి నుండి అధికారం కైవసం చేసుకోవడం కోసం కేటీఆర్ అసహనంతో వ్యవహరిస్తున్నారు. తెరవెనుక ఎన్నో కుయుక్తులు జరుపుతున్నారు. సొంత పార్టీనే విచ్ఛిన్నం చేయడం కోసం సిద్దపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో జరిగే చివరి ఎన్నిక హుజూరాబాద్ కానున్నది.
ఈ గూడుపుఠానికి పేరే ‘ఆపరేషన్ హైద్రావతి’. ఇప్పటికే కేటీఆర్ తానే ముఖ్యమంత్రిని అని మంత్రులు, కీలక నేతలతో ప్రచారం చేయించారు. ఆ రెండు సందర్భాల్లోనూ సీఎం కేసీఆర్ సదరు ప్రచారాన్ని ఖండించారు. అయితే కేటీఆర్ మాత్రం గజినీ మొహ్మద్ లాగా తండ్రి కుర్చీని లాగేసేందుకు ప్రయత్నిస్తున్నారని అరవింద్ జోస్యం చెప్పారు.
ఈ విషయం కేసీఆర్ కు కూడా అర్థమైంది. కన్నకొడుకు కాబట్టి కేటీఆర్ ను ఏమీ అనలేకపోతున్నా.. కేసీఆర్ తన జాగ్రత్తలో తానుంటున్నాడు. అందుకే టీఆర్ఎస్ ప్లీనరీ ప్రచార పోస్టర్లలో ఎక్కడా కేటీఆర్ ఫొటో లేకుండా చూసుకున్నారు..’ అని ఎంపీ అర్వింద్ వీడియోలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత అయిన ఎంకే స్టాలిన్ తో కలిసి చేస్తున్న ఆపరేషన్ పేరే హైద్రావతి. అందులో భాగంగానే టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యాడు.
పార్టీ పుట్టి 20 ఏళ్లయిన తర్వాత టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే పేరుతో మంత్రి కేటీఆర్ తమిళనాడుకు వెళ్లి డీఎంకే పని తీరును పరిశీలిస్తామని చెప్పడం కూడా ఆపరేషన్ లో భాగమే. టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో 80 శాతం మంది వలసదారులే.  ఒక్కరే (మైహోం రామేశ్వరరావు) కాబట్టి నేతలెవరూ ఆయనను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టే కేటీఆర్ తన ఎమ్మెల్యేలను స్టాలిన్ దగ్గరకు తీసుకెళుతున్నాడు. మనందరకీ స్టాలిన్ ఉన్నాడనే భరోసా కల్పించడానికే కేటీఆర్ ఈ పని చేస్తున్నారని అటు అరవింద్ కధనం.